Apple Outage | యాపిల్ సేవల్లో భారీ అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..
Apple Outage | యాపిల్‌కు చెందిన ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ పే, యాపిల్ మ్యూజిక్ సహా పలు ఆన్‌లైన్ సేవలు వేలాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయాయి. సంస్థ అంతర్గతంగా చేపట్టిన అప్‌డేట్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని యాపిల్ వెల్లడించింది. సైబర్ దాడి జరగలేదని స్పష్టం చేస్తూ, చాలా సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
Technology | Published On Nov 18, 2026, 1.32 pm IST
Apple Outage | యాపిల్‌కు చెందిన ఐక్లౌడ్, యాప్ స్టోర్, యాపిల్ పే, యాపిల్ మ్యూజిక్ సహా పలు ఆన్‌లైన్ సేవలు వేలాది మంది వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయాయి. సంస్థ అంతర్గతంగా చేపట్టిన అప్‌డేట్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని యాపిల్ వెల్లడించింది. సైబర్ దాడి జరగలేదని స్పష్టం చేస్తూ, చాలా సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
యాపిల్ పే సేవలకే ఎక్కువ అంతరాయం..
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సేవలను వినియోగించే వేలాది మంది సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) వినియోగదారులు సమస్యలను గుర్తించి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. అంతరాయాలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్‌లో గంట వ్యవధిలోనే వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా యాపిల్ పే సేవపై ఫిర్యాదులు కొద్ది నిమిషాల్లోనే సుమారు 2వేలకు చేరుకున్నాయి. యాపిల్ సపోర్ట్, యాపిల్ పే, ఐక్లౌడ్ సేవలు ఎక్కువగా ప్రభావితమైన వాటిలో ఉన్నాయి. వినియోగదారులు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగానే డౌన్‌డిటెక్టర్ గణాంకాలను రూపొందిస్తుంది. కాబట్టి వాస్తవంగా ప్రభావితమైన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యాపిల్ సంస్థ ఒక ప్రకటనలో తమ అంతర్గత అప్‌డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వెల్లడించింది. చాలా వ్యవస్థలు తిరిగి పనిచేస్తున్నాయని, మిగిలిన సేవలను కూడా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇది సైబర్ దాడి కాదని స్పష్టం చేసింది.
ఏయే సేవలపై ప్రభావం పడింది..?
యాపిల్ సిస్టమ్ స్టేటస్ పేజీ ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11:45 గంటల నుంచి యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్ సేవల్లో అంతరాయం నమోదైంది. అంతకుముందు 11:15 గంటల నుంచే యాపిల్‌కేర్ ఆన్ డివైస్ సేవలో సమస్యలు ప్రారంభమయ్యాయి. ఐక్లౌడ్ అకౌంట్, సైన్ ఇన్ సేవలు నెమ్మదిగా పనిచేయడం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవడం జరిగిందని, వినియోగదారులందరిపై ప్రభావం పడినట్లు యాపిల్ పేర్కొంది. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్ సేవలు మధ్యాహ్నం 2:02 గంటలకల్లా తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అనంతరం ఐక్లౌడ్ మెయిల్, ఐక్లౌడ్ వెబ్ సైట్ సేవల్లోనూ సమస్యలు నమోదయ్యాయి. ఐక్లౌడ్ మెయిల్ అంతరాయాన్ని మధ్యాహ్నం 2:25 గంటలకు పరిష్కరించినట్లు యాపిల్‌ఇన్‌సైడర్ వెల్లడించింది. ఐక్లౌడ్ సైన్ ఇన్ సమస్యను కూడా అనంతరం స్టేటస్ పేజీ నుంచి తొలగించారు. అయితే డెవలపర్లకు సంబంధించిన యాప్ స్టోర్ కనెక్ట్, ఎక్స్‌కోడ్ క్లౌడ్ సహా మరికొన్ని సేవలు బుధవారం తెల్లవారుజామున 12:50 గంటల సమయానికి కూడా ప్రభావితంగానే ఉన్నట్లు యాపిల్ డెవలపర్ స్టేటస్ పేజీ చూపించింది. ఐఫోన్ల యాక్టివేషన్‌లోనూ కొందరు వినియోగదారులు సమస్యలు ఎదుర్కోగా, కొన్ని యాపిల్ రిటైల్ స్టోర్లలో కొనుగోళ్ల ప్రక్రియ కూడా నిలిచిపోయినట్లు సమాచారం.
యాపిల్ సైన ఇన్ వ్యవస్థే కారణం..
ఈ అంతరాయంపై డిజిటల్ వార్‌ఫేర్‌కు చెందిన జేమ్స్ నైట్ స్పందిస్తూ, యాపిల్ సైన్ ఇన్ వ్యవస్థలో సమస్య తలెత్తితే ఒక్క యాప్ మాత్రమే కాకుండా అనేక సేవలు ప్రభావితమవుతాయని వివరించారు. ఐక్లౌడ్, యాపిల్ పే, యాప్ స్టోర్, కొత్త ఐఫోన్ సెటప్ వంటి అనేక సేవలకు యాపిల్ ఐడీ కీలకం కావడంతో, సైన్ ఇన్ సమస్య వినియోగదారులను ఒకేసారి పలు సేవలకు దూరం చేస్తుందని టామ్స్ గైడ్‌కు తెలిపారు. యాపిల్ ఐడీని ధ్రువీకరించాలని కోరుతూ వచ్చే అనుమానాస్పద సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని వినియోగదారులకు సూచించారు. కాగా అంతకుముందు రోజే అమెరికాలోని పలు ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్లోనూ సాంకేతిక అంతరాయాలు చోటుచేసుకున్నాయి. యాపిల్ సేవల అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రభావితమయ్యారనే వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!



