త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chahal-RJ Mahvash | ఆర్‌జే మ‌హ్వాశ్‌తో యుజ్వేంద్ర చాహ‌ల్ బ్రేక‌ప్‌..!

Chahal-RJ Mahvash | టీమిండియా స్నిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్‌, ఆర్‌జే మహ్వాశ్ ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ జంట ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్ల‌డంతో ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. తాజాగా ఈ జంట విడిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఆన్‌ఫాలో చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

P

Sports | Published On Jan 22, 2026, 12.50 pm IST

Chahal-RJ Mahvash | ఆర్‌జే మ‌హ్వాశ్‌తో యుజ్వేంద్ర చాహ‌ల్ బ్రేక‌ప్‌..!
Advertisement

Chahal-RJ Mahvash | టీమిండియా స్నిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్‌, ఆర్‌జే మహ్వాశ్ ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ జంట ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్ల‌డంతో ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. తాజాగా ఈ జంట విడిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఆన్‌ఫాలో చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

భార్య‌తో విడాకులు, మ‌హ్వాశ్‌తో డేటింగ్ వార్త‌ల నేప‌థ్యంలో చాహాల్‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రిగింది. ప్ర‌స్తుతం వీరిద్దిరి రిలేష‌న్‌పై ఊహానాగాలు రేకెత్తుతున్నాయి. అయితే, తాజాగా ప‌రిణామాల‌పై ఇద్ద‌రిలో ఎవ‌రూ స్పందించ‌న‌ప్ప‌టికీ.. ప్రొఫైల్స్‌ను ప‌రిశీలిస్తే ఒక‌రినొక‌రు ఫాలో కావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నార‌న్న వార్త‌లో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ అంశంపై ప‌లువురు యూజ‌ర్లు స్పందించారు. ఇద్ద‌రు అన్‌ఫాలో అయ్యార‌ని, ఇన్‌స్టాలో బ‌య‌ట‌ప‌డింద‌ని ఓ యూజ‌ర్ పేర్కొన్నాడు. ఇదంతా ఇన్‌స్టాగ్రామ్ డ్రామా అలెర్ట్ అంటూ మ‌రొక‌రు కామెంట్ చేశారు. ఇద్ద‌రి స్నేహం ముగిసిందా? ఇది సాధార‌ణంగానే అన్‌ఫాలో చేశారా? ఏమైనా ట్విస్ట్ ఉందా? అంటూ మ‌రొక‌రు స్పందించారు.

వాస్త‌వానికి టీమిండియా క్రికెట‌ర్ అయిన చాహ‌ల్‌, డ్యాన్స‌ర్‌, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ అయిన ధ‌న‌శ్రీ వ‌ర్మ ఇద్ద‌రూ 2020లో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రికి మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2025లో విడాకులు తీసుకున్నారు. అయితే, అంత‌కంటే ముందు నుంచే ఆర్‌జే మ‌హ్వాశ్‌తో చాహ‌ల్‌కు ప‌రిచ‌యం ఉంద‌ని, విడాకుల‌కు ఆమె కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ను చాహ‌ల్‌, మహ్వాశ్ ఖండించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. బ‌ర్త్ డేల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో పాటు వెకెష‌న్స్‌కు వెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీమిండియా మ్యాచుల స‌మ‌యంలో స్టేడియంలో మెరిసారు. ఐపీఎల్‌లో చాహ‌ల్ ఆడిన స‌మ‌యంలో స్టేడియంలో క‌నిపించింది. తాజాగా ఇద్ద‌రు ఇన్‌స్టా అకౌంట్స్‌ను అన్‌ఫాలో కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement