త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | డ‌బ్ల్యూపీఎల్ 2026.. తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన యూపీ..

WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న డ‌బ్ల్యూపీఎల్ 2026 టోర్నీలో భాగంగా నిర్వ‌హించిన 8వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ వుమెన్ జ‌ట్టుపై యూపీ వారియ‌ర్జ్ వుమెన్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో యూపీ ఈ టోర్నీలో త‌న తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

S

Cricket | Published On Jan 16, 2026, 6.58 am IST

WPL 2026 | డ‌బ్ల్యూపీఎల్ 2026.. తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన యూపీ..
Advertisement

WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న డ‌బ్ల్యూపీఎల్ 2026 టోర్నీలో భాగంగా నిర్వ‌హించిన 8వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ వుమెన్ జ‌ట్టుపై యూపీ వారియ‌ర్జ్ వుమెన్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో యూపీ ఈ టోర్నీలో త‌న తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. అంత‌కు ముందు రోజు జ‌రిగిన మ్యాచ్‌లో త‌క్కువ స్ట్రైక్ రేటుతో ఆడుతుంద‌ని యూపీ ప్లేయ‌ర్ హ‌ర్లీన్ డియోల్‌ను రిటైర్డ్ అవుట్‌గా చేసి టీం వెన‌క్కి ర‌ప్పించింది. కానీ తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం హ‌ర్లీన్ ఉత్త‌మ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టింది. దీంతో యూపీ టీం సునాయాసంగా విజ‌యం సాధించింది. టోర్నీలో మొద‌టిసారిగా గెలిచి ఊపిరి పీల్చుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ జ‌ట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. ముంబై ప్లేయ‌ర్ల‌లో నాట్ సివ‌ర్ బ్రంట్ (43 బంతుల్లో 65, 9 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), నికోలా కేరీ (20 బంతుల్లో 32 నాటౌట్‌, 5 ఫోర్లు) అద్భుతంగా రాణించ‌డంతో ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో డిఫెండ‌బుల్ స్కోరు చేసింది. యూపీ బౌల‌ర్ల‌లో శిఖా పాండే, దీప్తి శ‌ర్మ‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, ఆశా శోభ‌న త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన యూపీ వారియ‌ర్జ్ టీమ్ 42, 45 ప‌రుగుల వ‌ద్ద వ‌రుస‌గా రెండు వికెట్ల‌ను కోల్పోయింది. అయితే యూపీ ప్లేయ‌ర్లు హ‌ర్లీన్ డియోల్ (39 బంతుల్లో 64 నాటౌట్‌, 12 ఫోర్లు), ఫీబీ లిచ్‌ఫీల్డ్ (22 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) క్రీజులో చాలా సేపు నిలిచి యూపీ టీం విజ‌యానికి బాట‌లు వేశారు. దీంతో ఆ జ‌ట్టు సుల‌భంగానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 18.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను కోల్పోయిన యూపీ జ‌ట్టు 162 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో నాట్ సివ‌ర్ బ్రంట్ 2 వికెట్లు తీయ‌గా, అమెలియా కెర్ 1 వికెట్ తీసింది. ఇక ఈ మ్యాచ్ తో ముంబై రెండు వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డింది. మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన ముంబై 2 మ్యాచ్‌ల‌లో గెల‌వ‌గా, రెండింటిలో ఓట‌మి పాలైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. మ‌రోవైపు బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో ఉండ‌గా, టోర్నీలో తొలి గెలుపుతో యూపీ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement