WI vs SCO | స్కాట్లాండ్‌పై వెస్టిండిస్ విక్టరీ.. హ్యాట్రిక్ నమోదు చేసిన షెపర్డ్
WI vs SCO | షిమ్రాన్ హెట్మెయర్ బ్యాటింగ్, రొమారియో షెపర్డ్ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండిస్ గ్రూప్-సీ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. షెపర్డ్ మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు.
WI vs SCO | షిమ్రాన్ హెట్మెయర్ బ్యాటింగ్, రొమారియో షెపర్డ్ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండిస్ గ్రూప్-సీ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. షెపర్డ్ మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ స్థానంలో టీ20 ప్రపంచకప్‌లోకి స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్ స్కాట్లాండ్ తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఐదు బంతుల్లో ఒక పరుగు చేసి జోన్స్ అవుటవడంతో స్కాట్లాండ్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత, ఫామ్‌లో కనిపిస్తున్న బ్రెండన్ మెక్‌ముల్లన్, ఒక ఫోర్, ఒక సిక్స్ సహాయంతో 12 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పవర్‌ప్లేలో మున్సే రూపంలో స్కాట్లాండ్‌కు మూడో దెబ్బ తగిలింది. మూడు ఫోర్ల సహాయంతో 15 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటయ్యాడు. రిచీ బేరింగ్‌టన్, టామ్ బ్రూస్ నాలుగో వికెట్‌కు 46 బంతుల్లో 78 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కెప్టెన్ బేరింగ్‌టన్ అవుట్ అవడంతో భాగస్వామ్యానికి తెరపడింది. మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 24 బంతుల్లో 42 పరుగులు చేసి పెవిలియన్‌కు చేశాడు. ఆ తర్వాత గుడకేశ్ మోటి, ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 28 బంతుల్లో 35 పరుగులు చేసిన టామ్ బ్రూస్‌ను అవుట్ చేశాడు. వెస్టిండీస్ తరఫున షెపర్డ్ ఐదు వికెట్లు, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టారు. షమర్ జోసెఫ్, గుడకేశ్ మోటీకి చెరో వికెట్ దక్కింది.
రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్..
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ రొమారియో షెపర్డ్ టీ20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించి, టీ20 టోర్నమెంట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 17వ ఓవర్‌లో షెపర్డ్, రెండో బంతికి క్రాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి బంతికి లీస్క్‌ను ఖాతా తెరవకుండానే అవుట్ చేశాడు. నాలుగో బంతికి ఆలివర్ డేవిడ్‌సన్ వికెట్ తీసి షెపర్డ్ తన హ్యాట్రిక్ నమోదు చేశాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి సైఫ్యాన్ షరీఫ్‌ను అవుట్ చేశాడు. మొత్తం ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు.
వెస్టిండీస్ తరఫున బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ జట్టుకు మంచి శుభారంభం అందించారు. పవర్‌ప్లే వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. అయితే, లీస్క్ రెండు ఫోర్ల సహాయంతో 22 బంతుల్లో 19 పరుగులు చేసిన హోప్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బ్రాండన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 30 బంతుల్లో 35 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. హెట్మెయర్ దూకుడుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు.
హెట్మెయర్-పావెల్ మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పావెల్ ఫోర్, రెండు సిక్సర్లతో సహా 14 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, హెట్మెయర్ 19వ ఓవర్‌లో అవుటయ్యాడు. హెట్మెయర్ రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో సహా 36 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఆ తర్వాత షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో సహా 13 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రొమారియో షెపర్డ్ ఆరు పరుగులతో, మాథ్యూ ఫోర్డ్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. స్కాట్లాండ్ తరఫున బ్రాడ్ కర్రీ రెండు వికెట్లు తీయగా, సఫ్యాన్ షరీఫ్, ఆలివర్ డేవిడ్‌సన్, మైఖేల్ లీస్క్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






