IPL 2026 | ప్రఫుల్ హింగే ఎవరు..? ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లో మూడు వికెట్ల తీసిన సన్‌రైజర్స్ బౌలర్..!
IPL 2026 | ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ ఇచ్చాడు.
IPL 2026 | ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ ఇచ్చాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే.. ఆ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే అతను జట్టులోకి వచ్చినప్పటికీ.. ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో ఉండడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో రాజస్థాన్‌తో మ్యాచ్ అరంగేట్రంగా నిలిచింది.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇషాన్ కిషన్ దూకుడైన 91 పరుగులతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభం నుంచే దురదృష్టం వెంటాడింది. తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రఫుల్ హింగే తన తొలి ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, లేహువాన్ డ్రి ప్రియోరిటారియస్‌లను ఔట్ చేశాడు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగూ చేయకుండా పెవిలియన్‌కు చేరడం విశేషం. అనంతరం రియాన్ పరాగ్‌ను నాలుగు పరుగులకే అవుట్ చేసి జట్టుకు మరో షాక్ ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ జట్టు కేవలం తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా..
ఈ ప్రదర్శనతో ప్రఫుల్ హింగే ఐపీఎల్ చరిత్రలో కొత్త చరిత్రను నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఓపెనింగ్ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన 32 సార్లు తీయగా.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన బౌలర్ ఎవరూ లేరు. ఈ రికార్డు ఇప్పుడు హింగే పేరిట నమోదైంది. ఈ ఏడాది మినీ వేలంలో రూ.30 లక్షల ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని జట్టులోకి తీసుకుంది. అయితే, జట్టు పలు మ్యాచుల్లో దారుణంగా ఓటమిపాలైంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో హింగేపై టీమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని హింగే నిలబెట్టుకున్నాడు.
ఇప్పటివరకు ప్రఫుల్ హింగే పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 27 వికెట్లు సాధించి సగటు 26.66గా నిలిచాడు. విదర్భ జట్టుతో కలిసి విజయ్ హజారే ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టులో హింగే సభ్యుడు. ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. లిస్ట్-ఎ మ్యాచుల్లో కూడా అతని ఖాతాలో ఐదు వికెట్లు ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






