Nitin Nabin | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
Nitin Nabin | త్రినేత్ర.న్యూస్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడి (BJP National President) గా నితిన్ నబీన్ (Nitin Nabin) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలో నితిన్‌ను ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా బరిలో ఎవరూ లేకపోవడం ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఏకగ్రీవంగా ఎన్నిక
రేపు ప్రమాణ స్వీకారం
హాజరుకానున్న ప్రధాని
Nitin Nabin | త్రినేత్ర.న్యూస్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడి (BJP National President) గా నితిన్ నబీన్ (Nitin Nabin) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలో నితిన్‌ను ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా బరిలో ఎవరూ లేకపోవడం ఎన్నిక ఏకగ్రీవమైంది. 2020 నుంచి 2026 వరకు జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. గతేడాది డిసెంబర్‌లో అనూహ్యంగా నితిన్ నబీన్‌ను బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. దాంతో తదిపరి అధ్యక్షుడిగా ఆయనే ఎన్నికవుతారని అందరూ ఊహించినట్లుగానే ఎన్నిక ఏకగ్రీవమైంది.
బీహార్‌కు చెందిన 46 ఏళ్ల నితిన్ నబీన్ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. బీహార్ నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా నితిన్ గుర్తింపుపొందారు. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ సీనియర్ నేత. ఆయన ఎమ్మెల్యేగా ఉండి 2006లో ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికల్లో నితిన్‌ను పార్టీ బరిలోకి దింపింది. అప్పట్నించి వరుసగా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీహార్ రాష్ట్ర మంత్రిగా పలుమార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన బీహార్ ప్రజాపనుల శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



