త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinesh Phogat | చెదిరిన ఆసియా గేమ్స్ క‌ల‌.. ట్రయల్స్ సెమీఫైనల్‌లో వినేష్ ఓట‌మి..!

Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు 2026 ఆసియా గేమ్స్‌లో స్థానం సంపాదించాలన్న క‌ల చెదిరిపోయింది. శనివారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో 53 కిలోల విభాగం సెమీఫైనల్‌లో ఆమె యువ రెజ్లర్ మీనాక్షి గోయత్ చేతిలో 6-4 తేడాతో ఓడిపోయింది.

P

Sports | Published On May 30, 2026, 6.19 pm IST

Vinesh Phogat | చెదిరిన ఆసియా గేమ్స్ క‌ల‌.. ట్రయల్స్ సెమీఫైనల్‌లో వినేష్ ఓట‌మి..!
Advertisement

Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు 2026 ఆసియా గేమ్స్‌లో స్థానం సంపాదించాలన్న క‌ల చెదిరిపోయింది. శనివారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో 53 కిలోల విభాగం సెమీఫైనల్‌లో ఆమె యువ రెజ్లర్ మీనాక్షి గోయత్ చేతిలో 6-4 తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో వినేష్ భారత జట్టులో స్థానం కోల్పోయింది. ట్రయల్స్‌కు ముందు వినేష్‌కు స్వల్ప ఊరట లభించింది. తొలుత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఆమెను 50 కిలోల విభాగంలో మాత్రమే ట్రయల్స్ ఆడాలని సూచించింది.

53 కిలోల విభాగంలో ఆడేందుకు..

పారిస్ ఒలింపిక్స్ సహా గత నాలుగు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమె అదే బరువులో పోటీపడినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిపై వినేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది వివ‌క్ష‌తో కూడిన నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. అనంత‌రం రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు సంజ‌య్ సింగ్ ఆట‌గాళ్ల‌పై ఎలాంటి వివ‌క్ష ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తూ 53 కిలోల విభాగంలో పాల్గొనే అవకాశం కల్పించారు. బరువు కొలతలో వినేష్ బరువు 53.9 కిలోలుగా నమోదవడంతో ఆమెను 53 కిలోల విభాగ డ్రాలో చేర్చారు. ట్రయల్స్‌లో వినేష్ ప్రారంభ రౌండ్లలో మంచి ప్రదర్శన కనబరిచారు. మొదట జ్యోతి పై 7-1 తేడాతో గెలిచింది.

షేక్ హ్యాండ్‌కు నిరాక‌రించిన నిషు..

అనంతరం క్వార్టర్ ఫైనల్‌లో నిషు‌తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా, వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభంలో నిషు 5-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. ఒక దశలో వినేష్ ఇబ్బందుల్లో పడిన పరిస్థితి కనిపించింది. త‌న అనుభ‌వంతో వినేశ్ బలంగా తిరిగొచ్చారు. వీడియో స్క్రీన్‌లో సాంకేతిక సమస్యలు, కోచ్‌ల అభ్యంతరాలతో మ్యాచ్ మరింత ఉద్రిక్తంగా మారింది. 6-6 స్కోరు వద్ద నిషు చేసిన టేక్‌డౌన్ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ఆ నిర్ణయంపై నిషు కోచ్ అప్పీల్ చేసినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో వినేష్ సెమీఫైనల్‌కు చేరారు. పరాజయం అనంతరం నిషు రిఫరీతో పాటు వినేష్‌తో కూడా హ్యాండ్‌షేక్ చేయడానికి నిరాక‌రించింది.

నేను ఓడిపోలేద‌న్న వినేశ్‌..

సెమీఫైనల్ ఓటమి తర్వాత వినేష్ ఫోగట్ తాను విఫలమైందని భావించడం లేదని వ్యాఖ్యానించారు. నేను మొత్తం వ్యవస్థతో పోరాడాన‌ని.. ఒకవైపు నేను, మరోవైపు అందరూ ఉన్నార‌న్నారు. ప్రతి పాయింట్ కోసం పోరాడాల్సి వచ్చింది. నాకు న్యాయమైన అవకాశం దక్కలేద‌ని వ్యాఖ్యానించింది. తాను ముందుకు కూడా సాధన కొనసాగిస్తానని, బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేసింది. అయితే, తన తదుపరి పోటీల విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. 2026 ఆసియా గేమ్స్‌లో స్థానం దక్కకపోవడం వినేష్ ఫోగట్‌కు నిరాశ‌నిచ్చింది. అయినప్పటికీ, ఆమె తాజా వ్యాఖ్యలు చూస్తే రెజ్లింగ్‌కు దూరమయ్యే ఆలోచనలో దూర‌మ‌య్యే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చింది.

Advertisement
Advertisement