Vaibhav Suryavanshi | గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ..!
Vaibhav Suryavanshi | న్యూఢిల్లీ వేదికగా బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత సీనియర్ జట్టుతో పాటు ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును కూడా బోర్డు సత్కరించింది.
Vaibhav Suryavanshi | న్యూఢిల్లీ వేదికగా బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత సీనియర్ జట్టుతో పాటు ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును కూడా బోర్డు సత్కరించింది. అండర్-19 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సైతం కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్యక్రమం ప్రజెంటర్ అయిన హర్ష భోగ్లే ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లతో చిట్‌చాట్ నిర్వహించాడు. ఇందులో పాల్గొన్న వైభవ్ సూర్యవంశిని రికార్డుల గురించి ప్రశ్నించాడు.
ఈ సమయంలో హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ సైతం పక్కనే ఉండడం విశేషం. ఈ సందర్భంగా హర్షా భోగ్లే మాట్లాడుతూ.. “ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం, ఐపీఎల్‌లో ఎడమచేతి బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడం, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం? ఇందులో ఏ రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నావని ప్రశ్నించాడు. అలాగే, ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా? అంటూ ప్రశ్నించగా.. అది నాదే సర్ అంటూ నవ్వేశాడు. తనకు గ్రిస్ గేల్ 175 రన్స్ రికార్డును బ్రేక్ చేయాలని ఉందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల వైభవ్ అద్భుత ప్రదర్శన చేస్తున్న విషజ్ఞం తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
ఐపీఎల్‌లో 35 బంతుల్లో ఈ బిహార్ కుర్రాడు సెంచరీ నమోదు చేశాడు. ఓ భారత ఆటగాడికి ఈ టోర్నీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీకావడం విశేషం. ఐపీఎల్ హిస్టరీలో వేగంగా శతకం చేసిన ఆటగాడిగా రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ పుణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇక 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశి గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ జాబితాలో యూసుఫ్ పఠాన్ మూడోస్థానంలో ఉన్నాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ముంబయి ఇండియన్స్‌పై 37 బంతుల్లో సెంచరీ చేశాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






