UAE vs NZ | టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు రెండో విజయం.. యూఏఈపై పది వికెట్ల తేడాతో గెలుపు..!
UAE vs NZ | టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టిమ్ సీఫెర్ట్, ఫిల్ అల్లెన్ జోడీ రాణించడంతో యూఏఈని న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది.
UAE vs NZ | టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టిమ్ సీఫెర్ట్, ఫిల్ అల్లెన్ జోడీ రాణించడంతో యూఏఈని న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. మహ్మద్ వసీం, అలీషాన్ షరాఫు హాఫ్ సెంచరీలు చేయడంతో యూఏఈ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. 15.2 ఓవర్లలో 175 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లపై కివీస్ బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. ఏమాత్రం బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు.
టీ20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే భారీ భాగస్వామ్యం కావడం విశేషం. సీఫెర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలెన్ 50 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈకి మంచి ఆరంభం దక్కలేదు. ఎనిమిది పరుగులకే ఆర్యన్స్ శర్మను జాకబ్ డఫీ పెవిలియన్‌కు పంపాడు. అలిషాన్ షరఫు 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వత వసీం 37 బంతుల్లో అర్ధశతకం చేయడంతో యూఏఈ 170 పరుగులు చేయగలిగింది. వసీం 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. మయాంక్ కుమార్ 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లు మాట్ హెన్రీ రెండు వికెట్లు తీయగా.. జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






