U19 World Cup | అండర్-19 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్‌ని ప్రకటించిన ఐసీసీ.. వైభవ్ సూర్యవంశికి చోటు..!
U19 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అండర్-19 బెస్ట్ టీమ్‌ని ఆదివారం ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్‌లో విధ్వంసక శతకం సాధించిన వైభవ్ సూర్యవంశికి జట్టులో చోటు సంపాదించాడు. అలాగే, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్‌కు సైతం 12 మంది సభ్యుల జట్టులో చోటు లభించింది.
U19 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అండర్-19 బెస్ట్ టీమ్‌ని ఆదివారం ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్‌లో విధ్వంసక శతకం సాధించిన వైభవ్ సూర్యవంశికి జట్టులో చోటు సంపాదించాడు. అలాగే, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్‌కు సైతం 12 మంది సభ్యుల జట్టులో చోటు లభించింది. ఇటీవల జరిగిన ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ని సాధించింది. కనిష్క్ బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. హెనిల్ బంతితో రాణించాడు. టోర్నీలో తీసిన 11 వికెట్లలో యూఎస్‌ఏపై 16 పరుగులకు 5 వికెట్ల తీశాడు. రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్లకు బెస్ట్ టీమ్‌లో ఐసీసీ చోటు కల్పించింది.
థామస్ రేవ్‌ను బెస్ట్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. రేవ్ 66 సగటుతో 330 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు. మానీ లమ్స్‌డెన్ 16 వికెట్లతో టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇక బెన్ మేయెస్ సైతం ఐసీసీ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. టోర్నీలో 444 పరుగులతో టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో స్కాట్లాండ్‌పై 191 స్కోర్ చేశాడు. అండర్-19 పురుషుల ప్రపంచ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బ్రేక్ చేయడానికి కేవలం ఒకే పరుగు దూరంలో నిలిచాడు. అంతకు ముందు శ్రీలంకకు చెందిన విరాన్ చముడిత నెలకొల్పాడు. చముడిత జపాన్‌పై 192 పరుగులు చేశాడు. ఇందులో 26 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నది.
అలాగే, జట్టును సెమీ-ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్ఘనిస్తాన్ జోడీ ఫైసల్ ఖాన్ షినోజాదా, నూరిస్తానీ ఉమర్‌జాయ్‌కి జట్టులో ఐసీసీ చోటు కల్పించింది. ఫైసల్ టోర్నమెంట్‌లో ఐర్లాండ్, భారత్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించగా, నూరిస్తానీ 14 వికెట్లు పడగొట్టాడు. టాంజానియాపై తొమ్మిది పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆలివర్ పీక్ కూడా వెస్టిండీస్‌పై సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీలు చేశాడు. ఆలివర్, పాకిస్తాన్‌కు చెందిన అలీ రజా, వెస్టిండీస్‌కు చెందిన విటెల్ లావెస్ కూడా జట్టులో చోటు సంపాదించారు. రజా 13.92 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. ఓవర్‌కు కేవలం నాలుగు పరుగుల ఎకానమీ రేటుతో 13 వికెట్లు పడగొట్టాడు. జమైకా ఎడమచేతి వాటం స్పిన్నర్ లావెస్ ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. సెలక్షన్ ప్యానెల్‌లో ఇయాన్ బిషప్ (కోఆర్డినేటర్), లిడియా గ్రీన్‌వే, ఆండీ ఫ్లవర్ మరియు టెల్ఫోర్డ్ వైజ్ ఉన్నారు.
ఐసీసీ అండర్-19 బెస్ట్ టీమ్..
వైభవ్ సూర్యవంశి (భారత్), విరాన్ చాముదిత (శ్రీలంక), ఫైసల్ ఖాన్ షినోజాదా (ఆఫ్ఘనిస్తాన్), థామస్ రీవ్స్ (వికెట్ కీపర్, కెప్టెన్- ఇంగ్లండ్), ఆలివర్ పీక్ (ఆస్ట్రేలియా), బెన్ మాయెస్ (ఇంగ్లండ్), కనిష్క్ చౌహాన్ (భారత్), నురిస్తానీ ఉమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్), విటెల్ లావెస్ (వెస్టిండీస్), అలీ రజా (పాకిస్తాన్), మానీ లమ్స్‌డెన్ (ఇంగ్లండ్), హెనిల్ పటేల్ (భారత్).
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






