TG High Court | హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు షాక్.. ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు
TG High Court | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన ప్రక్రియ చట్టబద్ధం కాదని తేల్చిన న్యాయస్థానం, వెంటనే పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది.
TG High Court | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన ప్రక్రియ చట్టబద్ధం కాదని తేల్చిన న్యాయస్థానం, వెంటనే పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (స్పెషల్ ఏజీఎం) నిర్వహించాలని హెచ్‌సీఏ కార్యదర్శికి సూచించింది. హెచ్‌సీఏలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఈ తీర్పుతో కీలక మలుపు తిరిగింది. 2023 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్, అప్పటి అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో అమర్నాథ్ పరాజయం పాలయ్యారు. జగన్మోహన్రావుకు 63 ఓట్లు రాగా, అమర్నాథ్కు 62 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం ‘శ్రీ చక్ర క్లబ్’ అర్హత విషయంలో వివాదం చెలరేగింది.
ఆ క్లబ్ సమర్పించిన పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అమర్నాథ్, బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. గతంలో గౌలీపురా క్లబ్ పేరును శ్రీ చక్ర సీసీగా మార్చిన ప్రక్రియ చట్టవిరుద్ధమని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద ఓటును పక్కనపెట్టి, హెచ్‌సీఏ పరిపాలనలో ప్రతిష్ఠంభన ఏర్పడకుండా ఉండేందుకు అప్పట్లో అమర్నాథ్ను అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం అమర్నాథ్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో హెచ్‌సీఏలో మరోసారి ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



