త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs USA | టాస్ గెలిచి భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన యూఎస్ఏ.. శాంస‌న్‌కు ద‌క్క‌ని చోటు..

IND vs USA | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ అట్ట‌హాసంగా మొద‌లైంది. భార‌త్‌తో జ‌రుగ‌నున్న మ్యాచ్‌లో యూఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా యూఎస్ఏ మొనాంక్ పటేల్ మాట్లాడుతూ తుది జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు స్పెష‌లిస్ట్ బౌలర్లు ఉన్నారని తెలిపారు.

P

Sports | Published On Feb 7, 2026, 7.04 pm IST

IND vs USA | టాస్ గెలిచి భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన యూఎస్ఏ.. శాంస‌న్‌కు ద‌క్క‌ని చోటు..
Advertisement

IND vs USA | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ అట్ట‌హాసంగా మొద‌లైంది. భార‌త్‌తో జ‌రుగ‌నున్న మ్యాచ్‌లో యూఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా యూఎస్ఏ మొనాంక్ పటేల్ మాట్లాడుతూ తుది జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు స్పెష‌లిస్ట్ బౌలర్లు ఉన్నారని తెలిపారు. టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్ ఆడటం లేదని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. బుమ్రాకు ఒంట్లో బాగాలేద‌ని పేర్కొన్నాడు. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్‌కు తుదిజ‌ట్టులో చోటు క‌ల్పించారు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై భారత్ ఆడే తుది జట్టులో సంజు శాంసన్‌కు చోటు దక్కలేదు. అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ స్థానంలో శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్‌లో చేర్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో శాంసన్ గత ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓపెనింగ్ చేసినప్పటికీ, పెద్దగా రాణించ‌లేక‌పోయాడు. అలాగే, భారత్ ఆడిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో శాంసన్ బ్యాటింగ్ చేయలేదు. కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా యూఎస్ఏ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అంత‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌ప్‌ని స్టేడియంలోకి తీసుకువ‌చ్చారు.

భార‌త జ‌ట్టు : ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
యూఎస్ఏ : సాయితేజ ముక్కమల్ల, ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీప‌ర్‌), మొనాంక్ పటేల్ (కెప్టెన్‌), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, శుభమ్ రంజానే, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.

Advertisement
Advertisement