T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ షెడ్యూల్..! భారత్‌తో తలపడే జట్లు ఇవే..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ పోరు చివరి అంకానికి చేరింది. ఇప్పటికే సూపర్ ఎయిట్‌లో తలపడే జట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. చివరగా నబీమియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ గెలిచి సూపర్ ఎయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదో జట్లుగా నిలిచింది. సూపర్ ఎయిట్ మ్యాచులు ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్నాయి.
T20 World Cup | టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ పోరు చివరి అంకానికి చేరింది. ఇప్పటికే సూపర్ ఎయిట్‌లో తలపడే జట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. చివరగా నబీమియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ గెలిచి సూపర్ ఎయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎనిమిదో జట్లుగా నిలిచింది. సూపర్ ఎయిట్ మ్యాచులు ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్నాయి.
గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. భారత్ తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ మూడు విజయాలు, ఒక్క ఓటమితో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. యూఎస్ఏ, నమీబియా ప్రయాణం ముగిసిపోయింది. నమీబియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది. ఇక గ్రూప్-బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే తర్వాత రౌండ్‌కు చేరాయి. ఐర్లాండ్, ఒమన్ జట్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా సైతం గ్రూప్ దశలోనే ఇంటి బాటపట్టడం ఆశ్చర్యకరమైన విషయం. జింబాబ్వే, శ్రీలంక జట్లపై ఓటమితో ఆ జట్టు దాదాపు 17 ఏళ్ల తర్వాత గ్రూప్ స్టేజ్‌లోనే వైదొలగాల్సిన పరిస్థితి ఎదురైంది. గ్రూప్-సీ నుంచి ఆడిన మూడు మ్యాచుల్లో విజయంతో సూపర్ ఎయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లండ్ ఒక మ్యాచులో ఓటమిపాలైంది. స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ తర్వాతి రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాయి. గ్రూప్-డీ నుంచి న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో సూపర్ ఎయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. న్యూజిలాండ్ నాలుగు మ్యాచుల్లో ఒకదాంట్లో ఓటమిపాలైంది. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా నిష్క్రమించాయి.
సూపర్ ఎయిట్‌లో రెండు గ్రూపులు..
సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఒక్కో జట్లు ఆయా గ్రూప్‌లో ఉన్న మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. సూపర్ ఎయిట్ దశలో భారత్ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడుతుంది. మార్చి 1న రెండుసార్లు ప్రపంచక చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌తో చివరి మ్యాచ్ సూపర్ ఎయిట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే, గ్రూప్-2లో పోరు రసవత్తరంగా ఉండనున్నది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆయా గ్రూపుల్లో నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో ఏయే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
సూపర్ ఎయిట్ షెడ్యూల్ ఇదే..!
ఫిబ్రవరి 21న న్యూజిలాండ్ Vs పాకిస్థాన్ - కొలంబో
ఫిబ్రవరి 22న ఇంగ్లండ్ Vs శ్రీలంక - పల్లెకెలె
ఫిబ్రవరి 22న భారత్ Vs దక్షిణాఫ్రికా - అహ్మదాబాద్
ఫిబ్రవరి 23న జింబాబ్వే Vs వెస్టిండీస్ - ముంబై
ఫిబ్రవరి 24న ఇంగ్లండ్ Vs పాకిస్థాన్ - పల్లెకెలె
ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ Vs శ్రీలంక - కొలంబో
ఫిబ్రవరి 26న వెస్టిండీస్ Vs దక్షిణాఫ్రికా - అహ్మదాబాద్
ఫిబ్రవరి 26న భారత్ Vs జింబాబ్వే - చెన్నై
ఫిబ్రవరి 27న ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్ - కొలంబో
ఫిబ్రవరి 28న పాకిస్థాన్ Vs శ్రీలంక - పల్లెకెలె
మార్చి 1న జింబాబ్వే Vs దక్షిణాఫ్రికా - ఢిల్లీ
మార్చి 1న భారత్ Vs వెస్టిండీస్ - కోల్‌కతా
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






