T20 World Cup | రాణించిన సీఫెర్ట్.. అఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్ విక్టరీ..!
T20 World Cup | గ్రూప్-డీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కివీస్ జట్టు 17.5 ఓవర్లలో ఐదు వికెట్ల 183 పరుగులు చేసింది. సీఫెర్ట్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
T20 World Cup | గ్రూప్-డీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కివీస్ జట్టు 17.5 ఓవర్లలో ఐదు వికెట్ల 183 పరుగులు చేసింది. సీఫెర్ట్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఇలా..
ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లో ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు పడగొట్టి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఫిల్ అలెన్ ఒకే పరుగు చేయగా.. రచిన్ రవీంద్ర డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరు మూడో వికెట్‌కి 47 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫిలిప్స్ 25 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో సీఫెర్ట్ 42 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 65 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మార్క్ చాప్‌మన్ 17 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరగా డారిల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. మిచెల్ ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 14 బంతుల్లో 25 పరుగులు, శాంట్నర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో ఎనిమిది బంతుల్లో 17 పరుగులు చేసి చేసి నాటౌట్‌గా నిలిచారు. ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఇలా..
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ని ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ ప్రారంభించారు. వీరిద్దరూ జట్టుకు నిలకడైన ఆరంభాన్ని ఇచ్చి తొలి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, పవర్‌ప్లే ముగియక ముందే లాకీ ఫెర్గూసన్ న్యూజిలాండ్‌కు తొలి బ్రేక్ అందించాడు. ఒక ఫోర్ సహాయంతో 12 బంతుల్లో 10 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను ఫెర్గూసన్ అవుట్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి ఫెర్గూసన్ గుర్బాజ్‌ను బౌల్డ్ చేశాడు. గుర్బాజ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 22 బంతుల్లో 27 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత.. సెదిఖుల్లా, గుల్బదిన్ నైబ్ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. గుల్బదిన్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. సెదిఖుల్లా రెండు ఫోర్ల సహాయంతో 24 బంతుల్లో 29 పరుగులు అవుట్ అయ్యాడు. అయినా గుల్బదిన్ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ, రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గుల్బదిన్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 35 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున దర్విష్ రసూలీ (20), అజ్మతుల్లా ఒమర్జాయ్ (14), మహ్మద్ నబీ (10) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రకి తలో వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






