త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టక్కర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఐర్లాండ్‌కు తొలి విజ‌యం

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో గ్రూప్‌-బీలో సూప‌ర్‌-8 ఆశ‌లు స‌జీవంగా నిలుపుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది.

P

Sports | Published On Feb 14, 2026, 5.04 pm IST

T20 World Cup | టక్కర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఐర్లాండ్‌కు తొలి విజ‌యం
Advertisement

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 96 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో గ్రూప్‌-బీలో సూప‌ర్‌-8 ఆశ‌లు స‌జీవంగా నిలుపుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది. టీ20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు ఇదే అత్య‌ధిక స్కోర్ కాగా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో హై స్కోర్ కావ‌డం విశేషం. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన లోర్కాన్ టక్కర్ అజేయంగా 94 అద్భుత ఇన్నింగ్స్ కార‌ణంగా ఐర్లాండ్ జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. గాయంతో పాల్ స్ట‌ర్లింగ్ మ్యాచ్‌కు దూరం కాగా.. టక్కర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఆరంభంలో ఒమ‌న్ బౌల‌ర్ ష‌కీల్ అహ్మ‌ద్ ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి తెచ్చాడు. తొలి ఐదు ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు తీసి దూకుడును త‌గ్గించే ప్ర‌య‌త్నించాడు. అయితే, ట‌క‌ర్‌-గారెత్ డెలానీ జోడీ ధాటిగా బ్యాటింగ్‌ను కొన‌సాగించారు. ఫోల‌ర్లు, సిక్స‌ర్ల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులెత్తించారు. 11వ ఓవ‌ర్‌లో నదీమ్ ఖాన్ బౌలింగ్‌లో ఇద్దరూ ఒక్కో సిక్సర్ బాదారు. 13వ ఓవర్‌లో సుఫ్యాన్ మెహ్మూద్ బౌలింగ్‌లో టక్కర్ వరుసగా బౌండరీలు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో ఐర్లాండ్ బ్యాటర్లు ఎదురుదాడి చేశారు. మహ్మద్ నదీమ్ ఓవర్‌లో 26 పరుగులు, జితెన్ రామనంది ఓవర్‌లో 21 పరుగులు రాబ‌ట్టారు. చివర్లో జార్జ్ డాక్‌రెల్ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో స్కోరు 235కు చేరింది.

ప‌వ‌ర్ ప్లేలో ధాటిగా బ్యాటింగ్ కొన‌సాగినా..

ఇక 235 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్‌.. ప్రారంభంలో దూకుడుగా బ్యాటింగ్ కొన‌సాగించింది. ప‌వ‌ర్ ప్లేలోనే 63 ప‌రుగులు చేసింది. అమీర్ కలీమ్, హమ్మద్ మిర్జా జోడీ మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ప‌వ‌ర్ ప్లే ముగిసిన త‌ర్వాత ర‌న్‌రేట్ త‌గ్గుతూ వ‌చ్చింది. 11వ ఓవర్‌లో కలీమ్ అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఆ జ‌ట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. కేవ‌లం ఐదు ఓవ‌ర్ల‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. 16వ ఓవ‌ర్ ముగిసే స‌రికి తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. జోష్ లిటిల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఒమ‌న్ ప‌త‌నానికి బాట‌లు వేశాడు. చివరికి ఒమాన్ 20 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ ఘన విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మూడు క్యాచులు వ‌దిలేసింది. టోర్నీలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు జార‌విడిచిన క్యాచుల సంఖ్య 10కి చేరింది. ఒమ‌న్ సూప‌ర్ 8 ఆశ‌లు దాదాపు ముగిసిపోయాయి.

Advertisement
Advertisement