T20 World Cup | బెంగళూరు ఎక్సలెన్స్ సెంటర్‌లో తిలక్.. త్వరలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు గుడ్‌న్యూస్. యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మ్యాచ్ సిమ్యులేషన్స్‌లో పాల్గొన్నాడు. త్వరలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొంది.. తిరిగి జట్టుతో చేరనున్నాడు.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు గుడ్‌న్యూస్. యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మ్యాచ్ సిమ్యులేషన్స్‌లో పాల్గొన్నాడు. త్వరలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పొంది.. తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఐసీసీ పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్నది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తిలక్‌కు పొత్తికడుపు శస్త్రచికిత్స జరగడంతో టీ20 ప్రపంచ కప్‌లో ఆడతాడా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో తుది జట్టులో చోటు దక్కలేదు.
రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. తిలక్ శుక్రవారం మ్యాచ్ సిమ్యులేషన్‌లో పాల్గొన్నాడు. త్వరలోనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. ప్రపంచ కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టుతో తిలక్ ఫిబ్రవరి 3న చేరుతాడని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిమ్యులేషన్స్‌లో పాల్గొననున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సుందర్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. మయాంక్, పరాగ్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు దగ్గరలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల సమయంలో ఇండియా ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. రియాన్ పరాగ్ సైతం భుజం గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో మ్యాచ్ సిమ్యులేషన్స్‌లో పాల్గొననున్నాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






