త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | ఇట‌లీపై విజ‌యం.. సూప‌ర్ 8లోకి ఇంగ్లండ్‌..

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు సూప‌ర్‌8లోకి ఎంట్రీ ఇచ్చింది. కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇట‌లీతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ 202 ప‌రుగులు చేసింది. భారీ స్కోర్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఇట‌లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 178 ప‌రుగుల‌కు ఆల్ అవుట్ అయ్యింది.

P

Sports | Published On Feb 16, 2026, 7.41 pm IST

T20 World Cup | ఇట‌లీపై విజ‌యం.. సూప‌ర్ 8లోకి ఇంగ్లండ్‌..
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు సూప‌ర్‌8లోకి ఎంట్రీ ఇచ్చింది. కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇట‌లీతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ 202 ప‌రుగులు చేసింది. భారీ స్కోర్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఇట‌లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 178 ప‌రుగుల‌కు ఆల్ అవుట్ అయ్యింది. బెన్ మ‌నేంటి, గ్రాంట్ స్టీవర్ట్, జస్టిన్ మోస్కా మాత్ర‌మే రాణించ‌గా.. న‌లుగురు బ్యాట్స్‌మెన్ డ‌కౌట్ అయ్యారు. బెన్ మ‌నేంటి 26 బంతుల్లో ఆరు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల స‌హాయంతో అజేయంగా 60 ప‌రుగులు చేసి ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను వ‌ణించారు. ఓపెన‌ర్ జ‌స్టిస్ మోస్కా (43), స్టీవ‌ర్ (45) ప‌రుగులు చేశారు. మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ నుంచి స‌హ‌కారం అంద‌క‌పోవ‌డంతో ఇట‌లీ జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇట‌లీ పోరాటం ముగిసింది. ఇక చివ‌రి మ్యాచ్‌ను అఫ్ఘ‌నిస్థాన్‌తో ఆడ‌నున్న‌ది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జేమీ ఒవ‌ర్ట‌న్‌, సామ్ క‌ర్ర‌న్ చెరో మూడు వికెట్లు తీయ‌గా.. ఆర్చ‌ర్‌కి రెండు వికెట్లు ద‌క్కాయి. విల్‌జాక్‌, అదిల్ ర‌షీద్‌కు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 200పైగా స్కోర్ చేసింది. అయితే, మిడిల్‌లో ఓవ‌ర్ల‌లో ఎక్కువ‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. ఫిల్ సాల్ట్ తొలి బంతినే బౌండరీకి పంపాడు. కెప్టెన్ జోస్ బట్లర్ మరోసారి నిరాశ ప‌రిచాడు. గ్రాంట్ స్టీవర్ట్ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. జేకబ్ బెథెల్ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. ఐదో ఓవ‌ర్‌లో 17 ర‌న్స్ రావ‌డంతో ఇంగ్లండ్ స్కోర్ 50 దాటింది. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి ఇంగ్లండ్ రెండు వికెట్ల న‌ష్టానికి 56 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత స్పిన్న‌ర్లు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను క‌ట్ట‌డి చేశారు. 6-10 ఓవ‌ర్ల మ‌ధ్య కేవ‌లం 32 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి.

హ్యారీ బ్రూక్ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా నిలబడలేకపోయాడు. టామ్ బాంటన్ సైతం భారీ స్కోర్ చేయ‌లేక‌పోయాడు. 105 ర‌న్స్ వ‌ర‌కు ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో విల్ జాక్స్‌, సామ్ క‌ర్ర‌న్ జోడి ఇంగ్లండ్‌కు ఊపిరి పోసింది. ఇద్ద‌రు ఆరో వికెట్‌కు 54 ప‌రుగులు చేశారు. విల్ జాక్స్ 21 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లలో ఓ ఇంగ్లండ్ బ్యాటర్ వేగంగా హాఫ్ సెంచరీ ఇదే తొలిసారి. చివ‌రి ఓవ‌ర్ల‌లో బ్యాట్స్‌మెన్ వేగంగా ప‌రుగులు చేయ‌డంతో ఇంగ్లండ్ విజ‌యం సాధించ‌గ‌లిగింది. లేక‌పోతే ఇట‌లీ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యేది. అయితే, భారీ స్కోర్‌ను చూసి భ‌య‌ప‌డ‌కుండా ప‌సికూన ఇట‌లీ చివ‌రి వ‌ర‌కు త‌న‌వంతు పోరాడింది. ఇంగ్లిష్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడి చేసి కేవ‌లం 24 ప‌రుగుల తేడాతో ఓడినా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement