త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్‌ షురూ.. 19 జట్ల వివరాలు ఇవే..!

T20 World Cup | ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌కు కేవలం కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో మూడురోజుల్లో ధనాధన్‌ క్రికెట్‌ పండుగ షురూ కానున్నది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగనుంది. మొత్తం 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి.

P

Sports | Published On Feb 3, 2026, 2.45 pm IST

T20 World Cup | టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్‌ షురూ.. 19 జట్ల వివరాలు ఇవే..!
Advertisement
  • మెగా టోర్నీకి రంగం సిద్ధం
  • పెండింగ్‌లో శ్రీలంక తుది జట్టు ఎంపిక
  • డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారత్‌ బరిలోకి..
  • ఎనిమిది వేదికల్లో మ్యాచులు

T20 World Cup | ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌కు కేవలం కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో మూడురోజుల్లో ధనాధన్‌ క్రికెట్‌ పండుగ షురూ కానున్నది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా భారత జట్టు బరిలోకి దిగనుంది. మొత్తం 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి. ఇప్పటికే 19 దేశాల బోర్డులు తుది జట్లను ప్రకటించాయి. ఆతిథ్య దేశాల్లో ఒకటైన శ్రీలంక మాత్రం ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఐసీసీ ఈవెంట్‌లో ఆయా జట్లు తమ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యాయి.

టోర్నీ ఫార్మాట్‌..

గతేడాది తరహాలోనే ఈ సారి సైతం 20 జట్లు పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనున్నాయి. ఐదుజట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ స్టేజ్‌ తర్వాత సూపర్‌-8 మ్యాచులు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌ నుంచి రెండు జట్లు సూపర్‌ 8లోకి ప్రవేశిస్తాయి. ఇందులో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజింస్తారు. ఇందులో రెండు రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌లో తలపడుతాయి.

పాల్గొనే జట్లు ఇవే..

భారత్, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్ (బంగ్లాదేశ్ స్థానంలో), ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).

మ్యాచ్‌ వేదికలు..

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లోని ఎనిమిది వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. భారత్‌లోని ఐదు స్టేడియాలు, శ్రీలంకలోని మూడు స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి. భారత్‌లో ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో మ్యాచులు నిర్వహించనున్నారు. శ్రీలంక కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియం, ఎస్‌ఎస్‌సీ, క్యాండీలోని పల్లెకెలే అంతర్జాతీయ స్టేడియాలు మ్యాచులు జరుగుతాయి.

సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన ఘనత

భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ వరల్డ్‌ కప్‌లో అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. ఈ సారి భారత జట్టు టైటిల్‌ గెలిస్తే ఐసీసీ ట్రోఫీని దేశానికి అందించిన నాలుగో కెప్టెన్‌గా ఘనత సాధించనున్నాడు. ఇప్పటి వరకు కపిల్‌దేవ్‌ (1983 వన్డే వరల్డ్‌కప్‌), మహేంద్రసింగ్‌ ధోనీ (2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ), రోహిత్‌ శర్మ (2024 టీ20 వరల్డ్‌కప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ) ఈ ఘనత సాధించారు.

జట్ల వివరాలు ఇవే..

భారత్‌ : సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రింకు సింగ్‌.

యూఎస్ఏ : మొనాంక్‌ పటేల్‌ (కెప్టెన్‌), జెస్సీ సింగ్‌, ఆండ్రీస్‌ గౌస్‌, షెహన్‌ జయసూర్య, మిలింద్‌ కుమార్‌, ష్యాన్‌ జహంగీర్‌, సాయితేజ ముక్కమల్ల, సంజయ్‌ కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌, నోస్తుష్‌ కెన్జిగే, షాడ్లీ వాన్‌ స్కాల్క్‌విక్‌, సౌరభ్‌ నేత్రవాల్కర్‌, అలీ ఖాన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌, శుభమ్‌ రంజనే.

నమీబియా : మెర్వే గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్‌), జేన్‌ గ్రీన్‌, బెర్నార్డ్‌ స్కోల్ట్జ్‌, రుబెన్‌ ట్రంపెల్‌మన్‌, జేజే స్మిత్‌, జాన్‌ ఫ్రైలింక్‌, లారెన్‌ స్టీన్‌క్యాంప్‌, మాలన్‌ క్రూగర్‌, నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, జాక్‌ బ్రాసెల్‌, బెన్‌ షికోంగో, జెస్సీ బాల్ట్‌, డైలన్‌ లైచ్టర్‌, డబ్ల్యూపీ మైబర్గ్‌, మ్యాక్స్‌ హెంగో.
ట్రావెలింగ్‌ రిజర్వ్‌ : అలెగ్జాండర్‌ వోల్షెంక్‌.

ఆస్ట్రేలియా : మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జేవియర్‌ బార్ట్‌లెట్‌, కూపర్‌ కానెల్లీ, టిమ్‌ డేవిడ్‌, బెన్‌ ద్వార్షుయిస్‌, కామెరూన్‌ గ్రీన్‌, నాథన్‌ ఎల్లిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మాథ్యూ కుహ్నెమన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మాథ్యూ రెన్షా, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా.

జింబాబ్వే : సికందర్‌ రజా (కెప్టెన్‌), బ్రియన్‌ బెన్నెట్‌, ర్యాన్‌ బర్ల్‌, గ్రేమ్‌ క్రెమర్‌, బ్రాడ్లీ ఎవాన్స్‌, క్లైవ్‌ మదాండే, టినోటెండా మపోసా, తాదివనాషే మరుమాణి, వెల్లింగ్టన్‌ మసకద్జా, టోనీ మున్యొంగా, తషింగా ముసేకివా, బ్లెస్సింగ్‌ ముజారబానీ, డియాన్‌ మైర్స్‌, రిచర్డ్‌ న్గారావా, బ్రెండన్‌ టేలర్‌.

ఐర్లాండ్‌ : పాల్‌ స్టిర్లింగ్‌ (కెప్టెన్‌), మార్క్‌ అడైర్‌, రాస్‌ అడైర్‌, బెన్‌ కాలిట్జ్‌, కర్టిస్‌ క్యాంఫర్‌, గారెత్‌ డెలానీ, జార్జ్‌ డాక్‌రెల్‌, మాథ్యూ హంప్రీస్‌, జోష్‌ లిటిల్‌, బ్యారీ మెకార్తీ, హ్యారీ టెక్టర్‌, టిమ్‌ టెక్టర్‌, లోర్కన్‌ టక్కర్‌, బెన్‌ వైట్‌, క్రెగ్‌ యంగ్‌.

ఒమన్ : జతిందర్‌ సింగ్‌ (కెప్టెన్‌), వినాయక్‌ శుక్లా, మొహమ్మద్‌ నదీమ్‌, షకీల్‌ అహ్మద్‌, హమ్మద్‌ మిర్జా, వసీమ్‌ అలీ, కరణ్‌ సోనవాలే, షా ఫైసల్‌, నదీమ్‌ ఖాన్‌, సుఫ్యాన్‌ మహ్మూద్‌, జే ఒడేదారా, షఫిక్‌ జాన్‌, ఆశిష్‌ ఒడేదారా, జితేన్‌కుమార్ రామనంది, ఆమీర్‌ కలీమ్‌.

ఇంగ్లాండ్ : హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ బాంటన్‌, జేకబ్‌ బెథెల్‌, జోస్‌ బట్లర్‌, సామ్‌ కర్రన్‌, లియామ్‌ డాసన్‌, బెన్‌ డకెట్‌, విల్‌ జాక్స్‌, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, ఫిల్‌ సాల్ట్‌, జోష్‌ టాంగ్‌, లూక్‌ వుడ్‌.

వెస్టిండీస్ : షై హోప్‌ (కెప్టెన్‌), (షిమ్రోన్‌ హెట్‌మెయర్‌), జాన్సన్‌ చార్లెస్‌, రోస్టన్‌ చేస్‌, మాథ్యూ ఫోర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హోసైన్‌, షమార్‌ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, గుడాకేశ్‌ మోతి, రోవ్‌మన్‌ పావెల్‌, షెర్‌ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటిన్‌ సాంప్సన్‌, జేడెన్‌ సీల్స్‌, రొమారియో షెపర్డ్‌.

ఇటలీ : వేన్‌ మాడ్సెన్‌ (కెప్టెన్‌), మార్కస్‌ క్యాంపోపియానో, జియన్‌ పియెరో మీడ్‌, జైన్‌ అలీ, అలీ హసన్‌, క్రిషన్‌ జార్జ్‌ కలుగమాగే, హ్యారీ మానెంటీ, ఆంథోనీ మోస్కా, జస్టిన్‌ మోస్కా, సయ్యద్‌ నక్వీ, బెంజమిన్‌ మానెంటీ, జస్‌ప్రీత్‌ సింగ్‌, జేజే స్మట్స్‌, గ్రాంట్‌ స్టీవర్ట్‌, థామస్‌ డ్రేకా.

నేపాల్‌ : రోహిత్‌ పౌడెల్‌ (కెప్టెన్‌), దిపేంద్ర సింగ్‌ ఐరీ, సందీప్‌ లామిచానే, కుషాల్‌ భుర్టెల్‌, ఆసిఫ్‌ షేక్‌, సందీప్‌ జోరా, ఆరిఫ్‌ షేక్‌, బాసిర్‌ అహ్మద్‌, సోంపాల్‌ కామీ, కరణ్‌ కే‌సీ, నందన్‌ యాదవ్‌, గుల్షన్‌ ఝా, లలిత్‌ రాజబంశీ, షేర్‌ మల్లా, లోకేష్‌ బామ్‌.

స్కాట్లాండ్ : రిచీ బెర్రింగ్టన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్రూస్‌, మాథ్యూ క్రాస్‌, బ్రాడ్లీ కరీ, ఒలివర్‌ డేవిడ్‌సన్‌, క్రిస్‌ గ్రీవ్స్‌, జనుల్లా ఎహ్సాన్‌, మైఖేల్‌ జోన్స్‌, మైఖేల్‌ లీక్‌, ఫిన్‌లే మెక్‌క్రీత్‌, బ్రెండన్‌ మెక్‌ముల్లన్‌, జార్జ్‌ మున్సీ, సఫ్యాన్‌ షరీఫ్‌, మార్క్‌ వాట్‌, బ్రాడ్లీ వీల్‌.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: జాస్పర్‌ డేవిడ్‌సన్‌, జాక్‌ జార్విస్‌.

దక్షిణాఫ్రికా : ఏయిడెన్‌ మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), కార్బిన్‌ బోష్‌, డివాల్డ్‌ బ్రూవిస్‌, క్వింటన్‌ డికాక్‌, మార్కో జాన్సన్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌, క్వెనా మ్ఫాకా, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎన్గిడీ, ఆన్‌రిచ్‌ నోర్త్జే, కగిసో రబాడా, రయాన్‌ రికెల్టన్‌, జేసన్‌ స్మిత్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

న్యూజిలాండ్‌ : మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్మన్‌, డెవాన్‌ కాన్వే, జేకబ్‌ డఫీ, లాకీ ఫెర్గుసన్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమిసన్‌, డారిల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫర్ట్‌, ఇష్‌ సోధీ.

అఫ్గానిస్థాన్‌ : రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), నూర్‌ అహ్మద్‌, అబ్దుల్లా అహ్మద్‌జై, సెదికుల్లా అతల్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ, రహ్మనుల్లా గుర్బాజ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మొహమ్మద్‌ ఇషాక్‌ రహీమీ, షాహిదుల్లా కమాల్‌, మొహమ్మద్‌ నబీ, గుల్బదిన్‌ నయబ్‌, అజ్మతుల్లా ఉమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, దర్విష్‌ రసూలీ, ఇబ్రహీం జద్రాన్‌.
రిజర్వ్‌ ప్లేయర్స్‌ : ఏఎం ఘజన్ఫర్‌, ఇజాజ్‌ అహ్మద్‌ అహ్మద్‌జై, జియా ఉర్‌ రెహ్మాన్‌ షరీఫీ.

కెనడా : దిల్‌ప్రీత్‌ బజ్వా (కెప్టెన్‌), అజయ్‌వీర్‌ హుండాల్‌, అన్ష్‌ పటేల్‌, డిలోన్‌ హైలిగర్‌, హర్ష్‌ థాకర్‌, జస్కరందీప్‌ బుట్టర్‌, కలీమ్‌ సానా, కన్వర్‌పాల్‌ తాత్‌గూర్‌, నవనీత్‌ ధాలివాల్‌, నికోలస్‌ కిర్టన్‌, రవీందర్‌పాల్‌ సింగ్‌, సాద్‌ బిన్‌ జఫర్‌, శివమ్‌ శర్మ, శ్రేయాస్‌ మోవ్వా, యువరాజ్‌ సమ్రా.

యూఏఈ : మొహమ్మద్‌ వసీమ్‌ (కెప్టెన్‌), అలీషన్‌ షరఫూ, ఆర్యన్ష్‌ శర్మ, ధృవ్‌ పరాశర్‌, హైదర్‌ అలీ, హర్షిత్‌ కౌశిక్‌, జునైద్‌ సిద్ధిఖీ, మయాంక్‌ కుమార్‌, మొహమ్మద్‌ అర్ఫాన్‌, మొహమ్మద్‌ ఫారూఖ్‌, మొహమ్మద్‌ జవాదుల్లా, మొహమ్మద్‌ జోహైబ్‌, రోహిద్‌ ఖాన్‌, సోహైబ్‌ ఖాన్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌.

Advertisement
Advertisement