త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | ఆస్ట్రేలియాకు షాక్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాట్ క‌మ్మిన్స్‌ అవుట్‌..!

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఎదురుదెబ్బ త‌గిలింది. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ గాయంతో మెగా ఈవెంట్ నుంచి త‌ప్పుకున్నాడు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టులో రెండు మార్పులు చేసింది. కమిన్స్‌తో పాటు టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ షార్ట్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది.

P

Sports | Published On Jan 31, 2026, 3.35 pm IST

T20 World Cup | ఆస్ట్రేలియాకు షాక్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాట్ క‌మ్మిన్స్‌ అవుట్‌..!
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఎదురుదెబ్బ త‌గిలింది. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ గాయంతో మెగా ఈవెంట్ నుంచి త‌ప్పుకున్నాడు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల జట్టులో రెండు మార్పులు చేసింది. కమిన్స్‌తో పాటు టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ షార్ట్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించింది. వారి స్థానంలో ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షూయిస్, బ్యాట్స్‌మెన్ మాథ్యూ రెన్‌షాకు జ‌ట్టులో చోటు క‌ల్పించింది. క‌మిన్స్ చాలాకాలంగా గాయాల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ప‌లు మ్యాచుల‌కు దూర‌మ‌య్యాడు. టీ20 ప్రపంచ కప్‌తో మ‌ళ్లీ మైదానంలోకి వ‌స్తాడ‌ని భావించ‌గా.. క‌మిన్స్ కోలుకోక‌పోవ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. సీనియ‌ర్ ప్లేయ‌ర్ క‌మిన్స్ లేక‌పోవ‌డం ఆ జ‌ట్టుకు పెద్ద దెబ్బ‌లాంటిదే.

జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ ముగ్గురూ టీ20 ప్రపంచ కప్ కోసం ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో నెగ్గారు. హేజిల్‌వుడ్ యాషెస్‌కు ముందు కండరాల గాయానికి గురైన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. డేవిడ్ గాయం కారణంగా బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఎల్లిస్ సైతం ఇదే కార‌ణంతో బిగ్ బాష్ లీగ్ ఫైనల్, పాకిస్థాన్ పర్యటనకు దూర‌మైన విష‌యం తెలిసిందే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ముందు ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతోంది. టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న‌ది. ఆ జ‌ట్టు మ్యాచులు భార‌త్‌, శ్రీ‌లంక వేదిక‌గా జ‌రుగ‌నున్నాయి. ఆస్ట్రేలియా జ‌ట్టు గ్రూప్‌-బీలో ఉంది. ఈ గ్రూప్‌లో ఒమ‌న్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీ‌లంక ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 11న కొలంబోలో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది.

టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు..

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనాలి, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షూయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

Advertisement

తాజావార్తలు

Advertisement