త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | సూపర్‌ 8 కోసం మ్యాచ్ అధికారులను ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్‌లో ముగ్గురు భారతీయులు..!

T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2026 టీ20 ప్రపంచ కప్ సూపర్ 8కి సంబంధించిన మ్యాచ్ అధికారులను ప్రకటించింది. సూపర్ 8 మ్యాచులు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో 16 మంది అంపైర్లు, నలుగురు ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలను నియమించింది.

P

Sports | Published On Feb 21, 2026, 9.20 am IST

T20 World Cup | సూపర్‌ 8 కోసం మ్యాచ్ అధికారులను ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్‌లో ముగ్గురు భారతీయులు..!
Advertisement

T20 World Cup | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2026 టీ20 ప్రపంచ కప్ సూపర్ 8కి సంబంధించిన మ్యాచ్ అధికారులను ప్రకటించింది. సూపర్ 8 మ్యాచులు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో 16 మంది అంపైర్లు, నలుగురు ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలను నియమించింది. సూపర్ 8 మ్యాచ్‌లు కొలంబో వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్‌ మ్యాచ్‌తో ప్రారంభమవుతాయి. రోడ్నీ టక్కర్, పాల్ రీఫెల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. అల్లావుద్దీన్ పాలేకర్ టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తారు. సామ్ నోగాజ్‌స్కీ ఫోర్త్‌ అంపైర్‌గా వ్యవహరిస్తారు.

గ్రూప్‌-1 మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగే హైవోల్టేజ్‌ మ్యాచ్‌తో మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్ గఫానీ, రిచర్డ్ కెటిల్‌బరో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఉంటారు. అలెక్స్ వార్ఫ్ టీవీ అంపైర్‌గా, క్రిస్ బ్రౌన్ ఫోర్త్‌ అంపైర్‌గా వ్యవహరిస్తారు. మార్చి 1న కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో గఫానీ, వార్ఫ్ అంపైర్లుగా ఉంటారు. ఫిబ్రవరి 26న జరిగే భారత్‌ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌లో వార్ఫ్, కెటిల్‌ బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. శ్రీలంక మాజీ ఆటగాడు కుమార్ ధర్మసేన ఇటీవల 50వ టీ20 మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు. ఫిబ్రవరి 26న షాహిద్ సైకత్‌తో కలిసి వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు, మార్చి 1న రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో కలిసి దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్‌కు ఆయన అంపైర్‌గా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 23న ముంబయిలో జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, జయరామన్ మదన్‌ గోపాల్ అంపైరింగ్ చేస్తారు.

రిఫరీలు : రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్.
అంపైర్లు : రోడ్నీ టక్కర్, పాల్ రీఫెల్, అల్లాహుద్దీన్ పాలేకర్, సామ్ నోగాజ్‌స్కీ, నితిన్ మీనన్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అహ్సాన్ రజా, ఆసిఫ్ యాకూబ్, రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ, అలెక్స్ వార్ఫ్, క్రిస్ బ్రౌన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, జయరామన్ మదన్‌ గోపాల్, షాహిద్ సైకత్, కుమార్ ధర్మసేన.

Advertisement
Advertisement