Harshit Rana | టీ20 ప్రపంచకప్‌కి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక ఫాస్ట్ బౌలర్ అవుట్..?
Harshit Rana | టీ20 ప్రపంచకప్‌కి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని స్థానంలో మరో బౌలర్‌ను తీసుకునేందుకు బీసీసీఐ ప్రయత్నం చేస్తోందని సమాచారం.
Harshit Rana | టీ20 ప్రపంచకప్‌కి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని స్థానంలో మరో బౌలర్‌ను తీసుకునేందుకు బీసీసీఐ ప్రయత్నం చేస్తోందని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హర్షిత్ స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లుగా ఓ నివేదిక పేర్కొంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయమైంది. దాంతో టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం యూఎస్ఏతో జరగనున్న మ్యాచ్‌కు ముందు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షిత్ రాణా టోర్నీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఫిజియోలు గాయం గురించి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. బాగున్నట్లుగా అనిపించడం లేదని.. సాయంత్రానికి స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. హర్షిత్ టోర్నమెంట్ నుంచి హర్షిత్ తప్పుకుంటే.. వ్యూహం గురించి టీమ్ మేనేజ్‌మెంట్‌తో సూర్య చర్చించాడు. ఎనిమిది స్థానంలో అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. హర్షిత్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున తొమ్మిది టీ20 మ్యాచులు ఆడి.. తొమ్మిది వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 3/33.
హర్షిత్ రాణా టోర్నీ నుంచి తప్పుకుంటు సిరాజ్‌ను భారత జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో 2024 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులోనూ చోటు దక్కింది. కానీ, ఆడే అవకాశం మాత్రం రాలేదు. తాజాగా భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భాగం కావొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ తన చివరి టీ20 మ్యాచ్‌ను 2024లో జూలై 30 శ్రీలంకపై ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ టీ20ల్లో ఆడలేదు. భారత టెస్ట్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న సిరాజ్, 16 మ్యాచ్‌లలో 32.28 సగటుతో 14 వికెట్లు తీశాడు.
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ మొదలై.. మార్చి 8న జరుగనున్నది. మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. 40 గ్రూప్ దశ మ్యాచులు, 12 సూపర్-8 మ్యాచ్‌లు, రెండు సెమీ-ఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత అప్‌డేటెడ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. స్కాట్లాండ్ గ్రూప్ సీలో బంగ్లాదేశ్ స్థానంలో ఆడనున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే, ఫిబ్రవరి 15న జరగాల్సిన టోర్నమెంట్‌లోని హై వోల్టేజ్ మ్యాచ్ జరుగాల్సి ఉండగా.. మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






