Sunil Gavaskar | డబ్బులతో ఆయుధాలు కొని భారత్‌పైనే ఉపయోగించే పరిస్థితి వస్తుంది.. పాక్ ప్లేయర్ ఎంపికపై గవాస్కర్ రెస్పాన్స్..!
Sunil Gavaskar | ది హండ్రెడ్ లీగ్‌లో భాగమైన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ఆటగాళ్లకు భారతీయ యాజమాన్యాలు పారితోషికం చెల్లించడం నైతికంగా సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Sunil Gavaskar | ది హండ్రెడ్ లీగ్‌లో భాగమైన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ఆటగాళ్లకు భారతీయ యాజమాన్యాలు పారితోషికం చెల్లించడం నైతికంగా సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యలు పరోక్షంగా భారతీయుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితిని తీసుకురావొచ్చని గవాస్కర్ వ్యాఖ్యానించారు. 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి దూరం పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గురు చేశారు.
ఆ ఘటనల తర్వాత భారత్‌కు చెందిన ఫ్రాంచైజీలు పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడం మానేశాయని, ఇప్పుడు విదేశీ లీగ్‌లో భారత యాజమాన్యంలోని జట్టు పాకిస్థాన్ ఆటగాడిని ఎంపిక చేయడం ఆశ్చర్యమనిపించిందన్నారు. పాకిస్థాన్ క్రికెటర్లు విదేశీ లీగ్‌ల ద్వారా సంపాదించే ఆదాయంలో కొంత భాగం పన్నుల రూపంలో అక్కడి ప్రభుత్వానికి వెళ్తుందని గవాస్కర్ తెలిపారు. ఆ డబ్బును పాకిస్థాన్ ప్రభుత్వం ఆయుధాల కొనుగోలుకు వినియోగించే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ ఆయుధాలు చివరికి భారత్‌పైనే ఉపయోగించే పరిస్థితి వస్తుందని కూడా ఆయన విమర్శించారు. అందువల్ల భారతీయ యాజమాన్యాలు పాకిస్థాన్ ఆటగాళ్లకు ఇచ్చే ఫీజులు పరోక్షంగా భారత ప్రజలు, సైనికుల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిస్థితి తీసుకురావొచ్చన్నారు.
ఈ కారణాల వల్ల పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు అక్కడి సినిమా ప్రముఖులను కూడా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుతో అనుబంధం ఉన్న మాజీ క్రికెటర్ డేనియల్ వెట్టోరికి ఈ విషయాలపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే పాకిస్థాన్ ఆటగాడిని ఎంపిక చేయాలని భావించి ఉండవచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. అయితే, జట్టు యాజమాన్యానికి మాత్రం ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాల్సిందేనన్నారు. ఒక టోర్నమెంట్‌లో విజయం సాధించడం కంటే భారతీయుల ప్రాణాలు, దేశ భద్రత ముఖ్యమని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రతి భారతీయ ఫ్రాంచైజీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






