T20 world Cup | రసవత్తరంగా సూపర్-8 పోరు..! మరో ఐదు బెర్తుల కోసం రేసులో టాప్ జట్లు.. మేం తక్కువ కాదంటున్న పసికూనలు..!
T20 world Cup | భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ మ్యాచులు ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు సగం మ్యాచులు పూర్తయ్యాయి. దాంతో సూపర్ 8పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొట్టి కప్‌లో 20 జట్లు పాల్గొనగా నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్టు నాలుగు మ్యాచులు ఆడుతుంది. నాలుగు గ్రూపుల నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్ మూడేసి విజయాలతో సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చాయి. మిగతా ఆరు బెర్తుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది.
సూపర్ 8 అర్హత ఎలా?
ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న జట్లకే ప్రాధాన్యం ఉంటుంది. పాయింట్లు సమంగా ఉంటే నెట్ రన్ రేట్ నిర్ణాయకంగా మారుతుంది. అయితే, వరుస విజయాలతో స్పష్టమైన ఆధిక్యం సాధించిన జట్లకు లెక్కలు అవసరం లేకుండానే బెర్త్ ఖాయం అవుతుంది. మూడు విజయాలతో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు నేరుగా సూపర్ 8లోకి ప్రవేశించాయి. మిగతా స్థానాల కోసం పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. అయితే, చిన్న జట్లు సైతం అగ్రజట్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో పలు సంచలనాలు నమోదయ్యాయి. తాము సైతం ఏం తక్కువ కాదని.. తాము సైతం సూపర్ 8కి అర్హత సాధిస్తామని పసికూనలు.. టాప్ జట్లకు సవాల్ విసురుతున్నాయి.
పాక్‌కు యూఏఎస్‌తో తిప్పలు..
గ్రూప్-లో భారత్‌లో వరుసగా మూడు విజయాలను నమోదు చేసింది. దాంతో ఆరు పాయింట్లతో నేరుగా సూపర్8లో స్థానం ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్ నెదర్లాండ్స్‌తో తలపడనున్నది. భారత్‌పై ఓటమితో పాకిస్తాన్ సూపర్8 అవకాశాలు క్లిష్టంగా మారాయి. దాయాదికి యూఎస్‌ఏ జట్టు గట్టి పోటీ ఇస్తోంది. గత ప్రపంచకప్‌లోనూ పాక్‌కు చుక్కలు చూపించిన అమెరికా జట్టు.. మరోసారి షాక్ ఇచ్చేందుకు తహతహలాడుతోంది. భారత్ తర్వాత యూఎస్‌ఏ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. పాక్ ఖాతాలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు ఉన్నా రన్ రేట్ పరంగా యూఎస్‌ఏ మెరుగ్గా ఉంది. పాక్ తర్వాత మ్యాచ్ నమీబియాతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే తర్వాతి దశలోకి వెళ్తుంది. నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలతో యూఎస్‌ఏ సూపర్8లోకి ప్రవేశిస్తుంది.
గ్రూప్-బీలో రసత్తవరంగా పోరు..
గ్రూప్-బీలో సూపర్-8 పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే నాలుగే పాయింట్లతో తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఆసిస్‌ను పసికూన జింబాబ్వే మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నేడు (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే నాలుగేసి పాయింట్లతో రేసులో నిలుస్తుంది. శ్రీలంక గెలిస్తే మాత్రం తర్వాతి దశలోకి వెళ్లేందుకు అవకాశాలు సంక్లిష్టమవుతాయి. శ్రీలంకపై విజయం సాధించినా.. ఆ తర్వాత జింబాబ్వే-ఐర్లాండ్, బింబాబ్వే-శ్రీలంక మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. జింబాబ్వేపై శ్రీలంక విజయం సాధిస్తేనే సూపర్8లోకి వెళ్తుంది. జింబాబ్వే ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐర్లాండ్, శ్రీలంకతో ఏ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా ఆరు పాయింట్లతో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీలో ఉంటుంది. ఈ సమయంలో రన్ రేన్ కీలకం కానున్నది.
గ్రూప్-సీలో ఇంగ్లండ్‌కు గట్టి పోటీ..
గ్రూప్ సీలో వెస్టిండీస్ ఇప్పటికే ముందుకు మూడు విజయాలతో సూపర్8లోకి దూసుకెళ్లింది. ఈ గ్రూప్‌లో మరో స్థానం కోసం ఇంగ్లండ్ పోటీ పడుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ మూడు మ్యాచులు ముగిసిపోయాయి. చివరి మ్యాచ్‌లో ఇటలీతో సోమవారం తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సూపర్ 8కి అర్హత సాధిస్తుంది. ఇప్పటికే నేపాల్ మూడు పరాజయాలతో ఇంటిబాట పట్టింది. చివరిగా నామాత్రంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్ ఆడనున్నది. ఇటలీకి సైతం పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో విజయం సాధించింది. ఇంగ్లండ్, వెస్టిండిస్ జట్లను ఓడిస్తేనే తర్వాతి రౌండ్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
గ్రూప్-డీలో మరోస్థానం కోసం న్యూజిలాండ్ ఆశలు..
గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా సూపర్-8లోకి ప్రవేశించింది. మరోస్థానం కోసం న్యూజిలాండ్ ఆశలు పెట్టుకుంది. మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో రెండోస్థానంలో ఉన్నది. మంగళవారం కెనడాతో తలపడనున్నది. ఇందులో విజయం సాధిస్తే నేరుగా తర్వాతి రౌండ్‌లోకి వెళ్తుంది. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, యూఏఈతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. యూఏఈ ఒక విజయంతో మూడోస్థానంలో ఉండగా.. తర్వాతి మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఈ మ్యాచుల్లో విజయం సాధిస్తే సూపర్8లోకి నేరుగా వెళ్తుంది. ఒక మ్యాచ్‌లో గెలించి.. ఒక దాంట్లో ఓడితే అప్పుడు న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్‌తో పోటీలో నిలుస్తుంది. అఫ్ఘన్ జట్టు చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే పోటీలో నిలుస్తుంది. అప్పుడు కివీస్, యూఏఈ, అఫ్ఘనిస్తాన్ జట్లకు రన్ రేట్ కీలకమవుతుంది. మురుగ్గా ఉన్న జట్టు సూపర్-8లోకి అర్హత సాధిస్తుంది. మొత్తంగా గ్రూప్ దశ చివరి మ్యాచులు సూపర్ 8 సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉండడంతో ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారింది. ఇక ఏయే జట్లు సూపర్-8లోకి వెళ్తాయో వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






