SRH vs CSK | సదరన్ డెర్బీ.. టాస్ గెలిచిన చెన్నై.. హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్..!
SRH vs CSK | ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్నంది. టాస్ గెలిచి సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
SRH vs CSK | ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్నంది. టాస్ గెలిచి సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ మాట్లాడుతూ తాము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. పిచ్ బాగుందని, ఎక్కువ మార్పు ఉండదని.. అందుకే ఛేజింగ్ చేయడం మంచిదని భావించినట్లుగా తెలిపాడు. గత మ్యాచ్‌ల నుంచి తాము బేసిక్స్ సరిగా చేయడం మొదలుపెట్టామని తెలిపాడు.
నూర్ అహ్మద్ తిరిగి ఫామ్‌లోకి రావడం, అలాగే అంషుల్ డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ చేయడం జట్టుకు బలం ఇచ్చిందని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్ మాట్లాడుతూ తాము టాస్ గెలిచినా బ్యాటింగ్ చేసే వారమని తెలిపాడు. పిచ్ బాగుందని.. మంచి స్కోర్ చేయడమే లక్ష్యమని తెలిపాడు. ప్రారంభంలో బంతి కొంత స్వింగ్ అవుతుంది, బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని తెలిపాడు. జట్టులో మార్పుగా హర్ష్ దుబే స్థానంలో దిల్షాన్ మధుషంకను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: స్మరన్ రవిచంద్రన్, హర్ష్ దూబే, లియామ్ లివింగ్‌స్టోన్, దిల్షాన్ మధుషంక, హర్షల్ పటేల్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్, మాట్ హెన్రీ.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





