IPL 2026 | బ్యాటింగ్‌పైనే సన్‌రైజర్స్ ఆశలు.. బలహీనంగా బౌలింగ్ విభాగం..
IPL 2026 | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 19వ సీజన్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. గత కొద్ది సీజన్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న జట్లు ఈ సారైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
- ఆ నలుగురిపైనే అందరి దృష్టి
- ప్రారంభ మ్యాచ్‌లకు కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం
- ఇషాన్ కిషన్‌కు తాత్కాలిక కెప్టెన్ బాధ్యతలు
- నేడు ఆర్‌సీబీని ఢీకొట్టనున్న హైదరాబాద్
IPL 2026 | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 19వ సీజన్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. గత కొద్ది సీజన్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న జట్లు ఈ సారైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సారి జట్టు బ్యాటింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పేపర్‌పై బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్ విభాగంలో మాత్రం లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవే ఈ సీజన్‌లో ఆ జట్టుకు సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ ముగ్గురిపైనే ఆశలు..
హైదరాబాద్ బ్యాటింగ్ విజయావకాశాలు ప్రధానంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. గత సీజన్‌లో ఈ ముగ్గురు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టు పలు మ్యాచుల్లో ఇబ్బందులుపడింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు క్రీజులో నిలబడితే మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే సామర్థ్యం ఉంది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తే హైదరాబాద్ ఏ జట్టుకైనా గట్టి పోటీ ఇవ్వనుంది. జట్టుకు మిడిలార్డర్‌లో మంచి బ్యాటర్స్ ఉన్నారు. గత సీజన్‌లో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ సైతం ఈ సారి బ్యాటింగ్‌కు అండగా నిలుస్తాడని ఎస్‌ఆర్‌హెచ్ నమ్ముతోంది. మినీ వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌పై అంచనాలున్నాయి. గత సీజన్‌లో ఫినిషర్‌గా మెరిసిన అనికేత్ వర్మ, డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయాలని జట్టు ఆశిస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే వంటి ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు సమతూకంగా ఉంది. ముఖ్యంగా నితీశ్‌రెడ్డి బ్యాట్, బంతితోనూ కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.
బౌలింగ్‌లో లోపాలు..
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగం బలం ఉన్నప్పటికీ బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం జట్టుకు భారీ దెబ్బ. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. పేస్ విభాగంలో శివమ్ మావి, జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ ఉన్నా వీరిలో స్థిరత్వం లోపించింది. మ్యాచ్ గెలిపించే అవకాశాలు చాలా అరుదు. ఇక ఇషాన్ మలింగ ఫిట్‌నెస్‌తో ఇబ్బందులుపడ్డాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ జారీ చేసింది. ఎంత మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో స్పిన్ విభాగంలో మ్యాచ్‌ను నియంత్రించే బౌలర్ లేకపోవడం జట్టుకు మైనస్. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ మంచి ఆరంభం ఇస్తే.. మిడిలార్డర్ సైతం రాణిస్తే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో విఫలమైతే బౌలింగ్‌తో నెట్టుకు రావడం మాత్రం కష్టమే. ఐపీఎల్ 2026లో హైదరాబాద్ విజయం బ్యాట్స్‌మెన్ స్థిరత్వం, బౌలింగ్ విభాగం ఊహించిన దానికంటే మెరుగ్గా రాణంచాల్సి ఉంటుంది. రెండు విభాగాల్లో సమతుల్యత సాధిస్తే టైటిల్ పోరులో నిలిచే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు గట్టి సవాల్ ఎదురవనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఎస్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, ట్రావిస్ హెడ్, శివమ్ మావి, క్రియాన్ష్ ఫులేత్రా, ప్రఫుల్ హింగే, అమిత్ కుమార్, ఓంకార్ తుకారం తర్మలే, సాకిబ్ హుస్సేన్, జీషాన్ అన్సారి, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్, సలిల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (తాత్కాలిక కెప్టెన్-వికెట్ కీపర్), శివాంగ్ కుమార్, హర్ష్ దుబే, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






