త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | స‌న్ రైజ‌ర్స్‌కు షాక్‌.. గాయంతో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండ‌ర్‌ జాక్ ఎడ్వ‌ర్డ్స్ దూరం..!

IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్పటికే తమ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కార‌ణంగా ప్రారంభ మ్యాచుల‌కు దూర‌మ‌య్యాడు.

P

Sports | Published On Mar 20, 2026, 4.33 pm IST

IPL 2026 | స‌న్ రైజ‌ర్స్‌కు షాక్‌.. గాయంతో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండ‌ర్‌ జాక్ ఎడ్వ‌ర్డ్స్ దూరం..!
Advertisement

IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్పటికే తమ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కార‌ణంగా ప్రారంభ మ్యాచుల‌కు దూర‌మ‌య్యాడు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా పాదానికి గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జాక్ ఎడ్వర్డ్స్‌ను స‌న్‌రైజ‌ర్స్ రూ.3 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఎడ్వర్డ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL) 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అలాగే, 133 పరుగులు చేశాడు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర జట్టుతో రెండు షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లు ఆడాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ప్రారంభంలో తన రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో జట్టుకు అందకపోవడం గమనార్హం. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషాన్ వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా.. అభిషేక్ శర్మ డిప్యూటీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లలో ఎడ్వర్డ్స్, కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ గాయాల కారణంగా ఈ సారి ఐపీఎల్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశ ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ 2026 ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరితో పాటు త‌మిళ‌నాడు, అసోం, ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని 20 మ్యాచుల షెడ్యూల్‌ని ప్ర‌క‌టించింది. ఐపీఎల్ ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement