త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | సన్‌రైజర్స్‌కు షాక్‌.. పేసర్‌ శివమ్‌ మావి దూరం.. జట్టులోకి వచ్చిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌ స్టార్‌..!

IPL 2026 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా పేసర్‌ శివమ్‌ మావి సీజన్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబరీష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ ప్రకటించింది.

P

Sports | Published On May 1, 2026, 8.55 pm IST

IPL 2026 | సన్‌రైజర్స్‌కు షాక్‌.. పేసర్‌ శివమ్‌ మావి దూరం.. జట్టులోకి వచ్చిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌ స్టార్‌..!
Advertisement

IPL 2026 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా పేసర్‌ శివమ్‌ మావి సీజన్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబరీష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్‌ ప్రకటించింది. గజ్జల్లో గాయం కావడంతో టోర్నీ నుంచి శివమ్‌ తప్పుకున్నాడని, అతని స్థానంలో రూ.30లక్షల ఒప్పందంతో అంబరీష్‌ను చేర్చుకున్నట్లు ప్రవెల్లడించింది. చెన్నైకు చెందిన అంబరీష్ ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున ఆడాడు. కుడిచేతి మీడియం పేసర్‌గా, ఎడమచేతి బ్యాటర్‌గా రెండు విభాగాల్లోనూ తన ప్రతిభ చాటుకున్న అతను ఆ టోర్నీలో 11 వికెట్లు తీసి భారత్ తరఫున టాప్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.

ఈ ఆల్‌రౌండర్‌ చేరికతో మరింత జట్టు మరింత పటిష్టం కానుంది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టును గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. బౌలింగ్ విభాగంలో లోటును పూడ్చేందుకు ఇప్పటికే పలువురు రీప్లేస్‌మెంట్‌లను తీసుకున్నారు. జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పేన్‌ను తీసుకువచ్చింది. అతను గాయపడడంతో గెరాల్డ్ కోయెట్జీని ఎంపిక చేశారు. అలాగే బ్రైడన్ కార్స్ దూరమవడంతో శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంకను జట్టులోకి చేర్చింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ వరుసగా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఆదివారం ఉప్పల్‌ రాజీవ్‌ గాందీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

Advertisement
Advertisement