త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SRH | జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఎస్ఆర్‌హెచ్ ప్లేయ‌ర్లు..!

SRH | సన్ రైజర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్స్ అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి శ‌నివారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆల‌య అధికారులు వారికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

P

Sports | Published On Apr 4, 2026, 8.13 pm IST

SRH | జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఎస్ఆర్‌హెచ్ ప్లేయ‌ర్లు..!
Advertisement

SRH | సన్ రైజర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్స్ అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి శ‌నివారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆల‌య అధికారులు వారికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం క్రికెట‌ర్లు ఇద్ద‌రు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అర్చకులు పూజల అనంతరం ఆశీర్వ‌చ‌నం చేశారు. ఆల‌య అధికారులు జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ల 18వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచులు ఆడింది. తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓట‌మిపాలైంది. ఇటీవ‌ల కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇక ఆదివారం హైద‌రాబాద్ జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement
Advertisement