Spain Vs Austria | ఒయార్జబల్ డబుల్.. ప్రీక్వార్టర్స్‌లోకి స్పెయిన్
Spain Vs Austria | ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో స్పెయిన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి ప్రీక్వార్టర్‌కు చేరుకుంది. మికెల్ ఒయార్జబల్ డబుల్ గోల్స్‌తో మెరువగా.. పెడ్రో పోర్రో తన తొలి అంతర్జాతీయ గోల్‌తో జట్టు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో జూలై 6న డల్లాస్‌లో జరిగే ప్రీక్వార్టర్‌లో స్పెయిన్ పోర్చుగల్‌తో తలపడనుంది.
- ఆస్ట్రియాపై 3-0 తేడాతో జయకేతనం
- ఈ నెల 6న పోర్చుగల్‌తో ఢీ
- రికార్డును నెలకొల్పిన గోల్ కీపర్
Spain Vs Austria | ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో స్పెయిన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి ప్రీక్వార్టర్‌కు చేరుకుంది. మికెల్ ఒయార్జబల్ డబుల్ గోల్స్‌తో మెరువగా.. పెడ్రో పోర్రో తన తొలి అంతర్జాతీయ గోల్‌తో జట్టు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో జూలై 6న డల్లాస్‌లో జరిగే ప్రీక్వార్టర్‌లో స్పెయిన్ పోర్చుగల్‌తో తలపడనుంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్పెయిన్ తొలి నిమిషంలోనే లమిన్ యమాల్ షాట్‌తో ఆస్ట్రియా డిఫెన్స్‌ను పరీక్షించింది. ఆ తర్వాత ఎటాకింగ్‌తో ఒత్తిడిని పెంచింది. స్పెయిన్‌కు కార్నర్ ద్వారా మార్క్ కుకురెల్లా హెడ్డర్‌తో గోల్ వచ్చినా.. గోల్‌కీపర్ అలెగ్జాండర్ ష్లాగర్‌పై ఫౌల్ జరిగిందని రిఫరీ దాన్ని రద్దు చేశాడు. 36వ నిమిషంలో కుకురెల్లా ఇచ్చిన లో క్రాస్‌ను మికెల్ ఒయార్జబల్ తొలి టచ్‌తోనే హెడ్డర్‌గా గోల్‌లోకి పంపి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. తొలిభాగం ముగిసేలోపు అలెక్స్ బయెనా ఫ్రీకిక్ క్రాస్‌బార్‌ను తాకగా.. యమాల్ మరో ప్రయత్నాన్ని ష్లాగర్ అద్భుతంగా అడ్డుకున్నాడు.
ఇక ద్వితీయార్థం ప్రారంభంలో ఆస్ట్రియా పుంజుకునే ప్రయత్నం చేసింది. 61వ నిమిషంలో ప్రత్యామ్నాయ ఆటగాడు సాషా కలాజ్జిక్‌కు హెడ్డర్‌తో గోల్ చేసే అవకాశం లభించినా.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. ఆ తర్వాత మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్పెయిన్ 66వ నిమిషంలో ఆధిక్యాన్ని పెంచుకుంది. అలెక్స్ బయెనా ఇచ్చిన కచ్చితమైన క్రాస్‌ను పెడ్రో పోర్రో హెడ్డర్‌తో గోల్‌గా మలిచాడు. స్పెయిన్ తరఫున అతడికి ఇదే తొలి అంతర్జాతీయ గోల్. చివర్లో 89వ నిమిషంలో మరోసారి కుకురెల్లా క్రాస్‌ను ఒయార్జబల్ గోల్‌గా మలిచి తన రెండో గోల్‌తో పాటు జట్టు మూడో గోల్‌ను నమోదు చేసి 3-0 విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ కూడా చరిత్ర సృష్టించాడు. వరుసగా ఐదో ప్రపంచకప్ మ్యాచ్‌లోనూ ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా క్లీన్‌షీట్ నమోదు చేసి.. ప్రపంచకప్‌లో వరుసగా 519 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇటలీ దిగ్గజ గోల్‌కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డును అధిగమించాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
- ●Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి
- ●Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..
- ●Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
- ●Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్
- ●Ronaldo | చరిత్రపుటల్లో రొనాల్డో

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..

Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి

Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..






