Shane Warne’s Death | నా తండ్రి మరణానికి కొవిడ్ టీకానే కారణం కావొచ్చు..! షేన్ వార్న్ మృతిపై కొడుకు సంచలన వ్యాఖ్యలు..!
Shane Warne's Death | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణించి నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టీకాల ప్రభావమే తన తండ్రి మరణానికి కారణమై ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Shane Warne's Death | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణించి నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టీకాల ప్రభావమే తన తండ్రి మరణానికి కారణమై ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. “టూ వరల్డ్స్ కొలైడ్” పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జాక్సన్... తన తండ్రి ఆరోగ్య సమస్యలను అంగీకరించినప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్ పరిస్థితిని మరింత తీవ్రం చేసిందని భావిస్తున్నానన్నారు. 2022లో థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో 52 ఏళ్ల వయసులో వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలను నాలుగేళ్ల తర్వాత వెల్లడించడం గురించి జాక్సన్ మాట్లాడుతూ “ఇప్పుడీ విషయాన్ని చెబితే పెద్దగా వివాదం ఉండదని అనుకుంటున్నానని, నాన్నకు ఇప్పటికే కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నా, వ్యాక్సిన్ వల్ల అవి బయటపడ్డాయని నా అభిప్రాయమని తెలిపాడు. ఇది తనకు తరచూ గుర్తొచ్చే విషయమని పేర్కొన్నారు. వార్న్ మరణ వార్త విన్న వెంటనే తన తొలి స్పందన సమయంలో ప్రభుత్వం, కొవిడ్, వ్యాక్సిన్‌లను తొట్టిపోసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఆ భావోద్వేగాలను అంత్యక్రియల సమయంలో బయటపెట్టకుండా ఉండడం మంచిదైందని జాక్సన్ అభిప్రాయపడ్డారు. “అలా చేసి ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. కానీ, అప్పట్లో నాకు అలా అనిపించింది” అని చెప్పారు.
తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ ధూమపానం, మద్యం సేవించినప్పటికీ అప్పటికి బాగానే ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. ఎంతో కాలం తర్వాత సంతోషంగా, ఉత్సాహంగా కనిపించాడని.. కొంతమంది 80-90 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి అలవాట్లు కొనసాగిస్తారని చెప్పాడు. వార్న్ మరణానికి కొన్ని నెలల ముందు కొవిడ్ బారిన పడినట్లు కూడా తెలిపాడు. మరణించే సమయానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






