త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శాంస‌న్‌కు కేర‌ళ స‌ర్కారు స‌త్కారం.. ప్ర‌క‌టించిన మంత్రి..!

Sanju Samson | టీ20 వరల్డ్‌కప్‌లో భార‌తజ‌ట్టు విజ‌యంలో విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్‌కీపర్-బ్యాటర్ సంజూ శాంస‌న్‌ను కేర‌ళ ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం స‌న్మానించ‌నుంద‌ని విద్యాశాఖ మంత్రి శివ‌న్ కుట్టి తెలిపారు.

P

Sports | Published On Mar 9, 2026, 4.57 pm IST

Sanju Samson | వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో శాంస‌న్‌కు కేర‌ళ స‌ర్కారు స‌త్కారం.. ప్ర‌క‌టించిన మంత్రి..!
Advertisement

Sanju Samson | టీ20 వరల్డ్‌కప్‌లో భార‌తజ‌ట్టు విజ‌యంలో విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్‌కీపర్-బ్యాటర్ సంజూ శాంస‌న్‌ను కేర‌ళ ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం స‌న్మానించ‌నుంద‌ని విద్యాశాఖ మంత్రి శివ‌న్ కుట్టి తెలిపారు. శాంస‌న్ సాధించిన విజ‌యం యావ‌త్ కేర‌ళ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఎంతో మంది యువ క్రికెట‌ర్ల‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచాడ‌ని మంత్రి పేర్కొన్నారు. కేర‌ళం రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో జ‌రిగే స‌త్కార కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌రుకానున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.

చారిత్ర‌క విజ‌యాన్ని అందించిన శాంస‌న్‌

టీ20 వరల్డ్‌కప్ 2026లో తొలి ద‌శ‌లో ఆడే అవ‌కాశం శాంస‌న్‌కు రాలేదు. గ్రూప్ ద‌శ‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. సూప‌ర్8లో జింబాబ్వేపై 15 బంతుల్లోనే 24 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత నాకౌట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన కీలక క్వార్టర్ ఫైనల్‌లో 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఇక సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 46 బంతుల్లో 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చారిత్రక విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజ‌యంలో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్‌కప్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచుల్లో శాంస‌న్ 321 ప‌రుగుల‌తో.. ఐసీసీ ఈవెంట్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సైతం అందుకున్నాడు.

భార్యకు కృతజ్ఞతలు తెలిపిన శాంస‌న్‌

టీమిండియా విజ‌యం త‌ర్వాత శాంస‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా భావోద్వేగ పోస్టు పెట్టాడు. తాను తన భార్యను మొదటిసారి కలిసిన రోజు నుంచి ఇప్పటివరకు ఆమె త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని తెలిపాడు. క‌ష్ట స‌మ‌యాల్లో వ‌దిలిపెట్ట‌కుండా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచింద‌ని చెప్పుకొచ్చాడు. ఎన్నో రోజుల క‌ల నేడు నిజ‌మైంద‌ని, ఇందులో త‌న భార్య ఇచ్చిన స‌పోర్ట్ ఎంతో కీల‌క‌మ‌ని సోష‌ల్ మీడియా పోస్ట్‌లో శాంస‌న్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement