త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RCB SWOT Analysis | డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి ఆర్‌సీబీ..

RCB SWOT Analysis | ఐపీఎల్‌ 19వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగుపెడుతోంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో తలపడనుంది. విరాట్‌ కోహ్లీ మార్గదర్శకత్వంలో, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ నాయకత్వంలో ఆర్‌సీబీ మరోసారి టైటిల్‌ను కాపాడుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

P

Sports | Published On Mar 28, 2026, 8.45 am IST

RCB SWOT Analysis | డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి ఆర్‌సీబీ..
Advertisement
  • మళ్లీ విరాట్‌ కోహ్లీపైనే జట్టు ఆశలు
  • పవర్‌ఫుల్‌గా బ్యాటింగ్‌ లైనప్‌
  • ఇద్దరు కీలక బౌలర్లు దూరం
  • జోష్‌ హేజిల్‌వుడ్‌ టోర్నీలో ఆడేది అనుమానమే

RCB SWOT Analysis | ఐపీఎల్‌ 19వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగుపెడుతోంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో తలపడనుంది. విరాట్‌ కోహ్లీ మార్గదర్శకత్వంలో, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ నాయకత్వంలో ఆర్‌సీబీ మరోసారి టైటిల్‌ను కాపాడుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్‌సీబీ జట్టుకు అతిపెద్ద బలం సీనియర్‌ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ. కింగ్‌ మైదానంలో ఉంటే ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది. టైటిల్‌ సాధించాలంటే ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దని కోహ్లీ ఇప్పటికే సహచరులకు సూచించాడు. ప్రతి ఆటగాడు 120 శాతం కృషి చేయాల్సిందేనని స్పష్టం చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతుల్యతతో పాటు ఆల్‌రౌండర్ల బలం కూడా జట్టుకు ప్లస్‌గా కనిపిస్తోంది.

వీళ్లపైనే ఫోకస్‌..

విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం అంతర్జాతీయంగా కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ఐపీఎల్‌కు సన్నద్ధం కావడానికి సమయం దొరికింది. అతని ఫిట్‌నెస్‌ కూడా జట్టుకు అదనపు బలం. ఫిల్‌ సాల్ట్‌ మంచి ఆరంభం ఇవ్వగలడు. ఇంగ్లిష్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బెతెల్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌పై సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. అతను టచ్‌లో ఉండడంతో మిడిలార్డర్‌ మరింత పటిష్టంగా మారింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. క్రునాల్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్‌, వెస్టిండీస్‌కు చెందిన రొమారియో షెఫర్డ్‌ వంటి ఆల్‌రౌండర్లు బ్యాట్‌, బాల్‌తో జట్టుకు సేవలందించనున్నారు. దేశీయ క్రికెట్‌లో రాణించిన దేవదత్‌ పడిక్కల్‌ కూడా ఈ సీజన్‌లో తన సత్తాచాటాలని ఆసక్తితో ఉన్నాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, జేకబ్‌ డఫీ ప్రభావం చూపించనున్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసిన కనిష్క్‌ చౌహాన్‌ ఆఫ్‌ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సహకరించగలడు. హైదరాబాద్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మకు ఆఫ్‌ స్పిన్‌పై ఇబ్బంది ఉండడంతో తొలి మ్యాచ్‌లో చౌహాన్‌ కీలకంగా మారే అవకాశముంది.

బలహీనతలు ఇవే..

ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమవుతుండటం జట్టుకు భారీ లోటు. గాయంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. టోర్నీ మధ్యలోనైనా చేరుతాడా లేదా అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. గత సీజన్‌లో టైటిల్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన టిమ్‌ డేవిడ్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ కూడా దేశీయ టోర్నీల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఫాస్ట్‌ బౌలర్‌ యశ్‌ దయాల్‌ సైతం ఈ సారి అందుబాటులో ఉండడం లేదు. ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆర్‌సీబీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతన్ని పక్కనపెట్టింది. అయితే, దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. రెండు రాష్ట్రాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. ఇందులో ఒకటి పోక్సో కేసు ఉంది. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆర్‌సీబీ జట్టు

రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్‌, విరాట్‌ కోహ్లీ, దేవదత్‌ పడిక్కల్‌, జేకబ్‌ బెతెల్‌, క్రునాల్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్‌, విహాన్‌ మల్హోత్రా, రొమారియో షెఫర్డ్‌, మంగేష్‌ యాదవ్‌, కనిష్క్‌ చౌహాన్‌, సత్విక్‌ దేశ్వాల్‌, ఫిల్‌ సాల్ట్‌ (వికెట్‌ కీపర్‌), జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జోర్డాన్‌ కాక్‌ (వికెట్‌ కీపర్‌), అభినందన్‌ సింగ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, రసిక్‌ సలామ్‌ దార్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సుయాష్‌ శర్మ, స్వప్నిల్‌ సింగ్‌, నువాన్‌ తుషారా, జేకబ్‌ డఫీ, విక్కీ ఓస్త్వాల్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement