త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravi Shastri | ఇంగ్లండ్ జ‌ట్టు కోచ్‌గా ర‌విశాస్త్రి..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో ఆయ‌న‌కే తెలుస‌ట‌..?

Ravi Shastri | భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్‌, క్రికెట్ కామెంటేటర్ ర‌విశాస్త్రి ఇంగ్లండ్ జ‌ట్టుకు కోచ్‌గా వెళ్ల‌నున్నారా..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో కేవ‌లం ఆయ‌న‌కు మాత్ర‌మే తెలుసా..? అంటే.. అవున‌నే అంటున్నాడు ఆ ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్‌.

S

Cricket | Published On Dec 25, 2025, 9.52 am IST

Ravi Shastri | ఇంగ్లండ్ జ‌ట్టు కోచ్‌గా ర‌విశాస్త్రి..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో ఆయ‌న‌కే తెలుస‌ట‌..?
Advertisement

Ravi Shastri | భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్‌, క్రికెట్ కామెంటేటర్ ర‌విశాస్త్రి ఇంగ్లండ్ జ‌ట్టుకు కోచ్‌గా వెళ్ల‌నున్నారా..? ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో కేవ‌లం ఆయ‌న‌కు మాత్ర‌మే తెలుసా..? అంటే.. అవున‌నే అంటున్నాడు ఆ ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్‌. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్ర‌స్తుతం 0-3 తేడాతో ఘోర ప‌రాభ‌వాన్ని మూట గ‌ట్టుకుంది. మ‌రో రెండు టెస్టులు మిగిలి ఉండ‌గా ఆ జ‌ట్టు కోచ్ బ్రెండాన్ మెక‌ల్ల‌మ్‌తోపాటు కెప్టెన్‌గా స్టోక్స్‌ను త‌ప్పించాల‌ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు టెస్టు మ్యాచ్‌కు ప్రిపేర్ అయ్యేందుకు స‌రైన స‌మ‌యం ల‌భించిన‌ప్ప‌టికీ మ‌ద్యం మ‌త్తులో తూగి మ్యాచ్‌లో పేల‌వ‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రిచార‌ని ఇంగ్లండ్ జ‌ట్టుపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్ జ‌ట్టుకు కోచ్‌గా ర‌విశాస్త్రి వ‌స్తే బాగుంటుంద‌ని ఆ జ‌ట్టుకు చెందిన మాజీ ప్లేయ‌ర్ వ్యాఖ్యానించ‌డం ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ర‌విశాస్త్రికి వాళ్ల టెక్నిక్స్ తెలుసు: ప‌నేసార్‌..

ఇంగ్లండ్ మాజీ స్పిన్ బౌల‌ర్ మాంటీ పనేసార్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. త‌మ జ‌ట్టుకు కోచ్‌గా ర‌విశాస్త్రి వ‌స్తే బాగుంటుంద‌ని అన్నాడు. ర‌విశాస్త్రి కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో టీమిండియా 2018-19, 2020-21ల‌లో ఆస్ట్రేలియాలో వ‌రుస‌గా టెస్టు సిరీస్‌ల‌ను గెలుచుకుంద‌ని, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల మైండ్ సెట్‌, టెక్నిక్స్‌, వారిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా ఓడించాలి అన్న మెళ‌కువ‌లు ర‌విశాస్త్రికి బాగా తెలుస‌ని, క‌నుక ఆయ‌న ఇంగ్లండ్ జ‌ట్టుకు కోచ్‌గా వ‌స్తే బాగుంటుంద‌ని ప‌నేసార్ అన్నాడు. దీంతో ప‌నేసార్ వ్యాఖ్య‌లు సామాజిక మాధ్య‌మాల్లో సైతం వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ప్లేయ‌ర్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ వ్య‌వ‌హరిస్తుండ‌గా, ఆయ‌న సూచించిన‌ట్లుగా కొన‌సాగిస్తున్న బేజ్‌బాల్ టెస్టు క్రికెట్‌లో విఫలం అయింద‌ని ప‌నేసార్ అన్నాడు. టెస్టు క్రికెట్‌కు బేజ్‌బాల్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

4వ టెస్టుకు సిద్ధం..

అయితే ప‌నేసార్ వ్యాఖ్య‌ల‌పై ర‌విశాస్త్రి ఇంకా స్పందించ‌లేదు. కానీ నేటి ప్ర‌పంచంలో ఏదైనా సాధ్య‌మే. క‌నుక ర‌విశాస్త్రి ఇంగ్లండ్ జ‌ట్టుకు కోచ్‌గా వెళ్ల‌డం అతిశ‌యోక్తి ఏమీ కాదు. అయితే ప‌నేసార్ వ్యాఖ్య‌ల‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందా, లేదా అన్న‌ది చూడాలి. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇప్ప‌టికే 3-0తో ఆధిక్యంలో ఉండ‌డ‌మే కాకుండా ఇప్ప‌టికే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న ఆసీస్ డిసెంబ‌ర్ 26వ తేదీ శుక్ర‌వారం నుంచి మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టు కోసం స‌న్న‌ద్ధం అవుతోంది. 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తోంది. మరోవైపు స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ జ‌ట్టు మాత్రం క‌నీసం మిగిలిన రెండు టెస్టుల్లో అయినా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి క్లీన్ స్వీప్ కాకుండా, ప‌రువు పోకుండా గెల‌వాల‌ని ఆలోచిస్తోంది. మ‌రి ఆ రెండు టెస్టుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement