Rajasthan Royals | మరోసారి అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్.. కొత్త ఓనర్‌గా లక్ష్మీ మిట్టల్, అదార్ పూనావాలా
Rajasthan Royals | ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మరోసారి అమ్ముడుపోయింది. కేవలం నెలన్నర వ్యవధిలో రెండోసారి యాజమాన్యం మారడం గమనార్హం. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆయన తనయుడు ఆదిత్య మిట్టల్‌తో పాటు అదార్ పునావాలా ఈ జట్టును కొనుగోలు చేశారు.
Rajasthan Royals | ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మరోసారి అమ్ముడుపోయింది. కేవలం నెలన్నర వ్యవధిలో రెండోసారి యాజమాన్యం మారడం గమనార్హం. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆయన తనయుడు ఆదిత్య మిట్టల్‌తో పాటు అదార్ పునావాలా ఈ జట్టును కొనుగోలు చేశారు. సుమారు 1.65 బిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.15,600 కోట్లకుపైగా)కు ఈ ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం రేసు నుంచి తప్పుకోవడంతో ఈ ఒప్పందం తుది దశకు చేరింది. ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే సీసీఐ, ఐపీఎల్ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు సైతం అవసరం. అన్ని అనుమతులు లభిస్తే 2026 మూడో త్రైమాసికంలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇంతకుముందు సోమాని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చినా, డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆ ఒప్పందం ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం మిట్టల్ కుటుంబం సుమారు 75 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. అదార్ పూనావాలా 18 శాతం వాటా కాగా.. మిగిలిన 7 శాతం ప్రస్తుత ఇన్వెస్టర్ల వద్దే ఉంటుంది. అందులో మనోజ్ బదలే సైతం కొనసాగనున్నారు. కొత్త బోర్డులో లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్-భాటియా, అదార్ పూనావాలా, మనోజ్ బదలే సభ్యులుగా ఉండనున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలోని పార్ల్ రాయల్స్, వెస్టిండీస్‌లోని బార్బోడాస్ రాయల్స్‌లోనూ జట్లున్నాయి. లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ నాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమన్నారు. తమ కుటుంబం రాజస్థాన్‌కు చెందిందని.. అందుకే ఐపీఎల్‌లో ఇతర జట్ల కంటే రాజస్థాన్ రాయల్స్‌తో భాగస్వామ్యం కావాలని అనిపించిందని చెప్పారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






