IND Vs AFG Test | ముల్లాన్‌పూర్ టెస్ట్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ షా చరిత్ర..
IND Vs AFG Test | భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మత్ షా చరిత్ర సృష్టించాడు. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆయన టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
IND Vs AFG Test | భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మత్ షా చరిత్ర సృష్టించాడు. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆయన టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా రహ్మత్ షా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 564/8 డిక్లేర్ చేసిన భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయింది. రహ్మత్ షా ఒంటరిగా పోరాడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండోరోజు మూడో సెషన్‌లో మానవ్ సుతార్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఆడిన షాట్‌తో ఆయన 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఆ సమయానికి 30 పరుగులు అవసరం కాగా, ఆ బౌండరీతో 31 పరుగులకు చేరుకున్నాడు. అదే మ్యాచ్‌లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన మానవ్ తొలిమ్యాచ్‌లోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తాను వేసిన తొలి ఓవర్‌లోనే అబ్దుల్ మాలిక్‌ను పెవిలియన్‌కు పంపి టెస్ట్ క్రికెట్‌లో తొలి వికెట్ తీశాడు. ఆ తర్వాత రహ్మానుల్లా గుర్బాజ్‌ను స్లిప్స్‌లో క్యాచ్ రూపంలో అవుట్ చేశాడు. బంతి టర్న్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇక ఇదే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చూపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. సాయి సుదర్శన్ 81 పరుగులతో ఆకట్టుకోగా, రిషబ్ పంత్ కూడా 81 పరుగులే చేసి కొద్ది పరుగుల దూరంలోనే సెంచరీలను మిస్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ అజేయంగా 52 పరుగులు చేయగా.. భారత్ 564/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు
- ●CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?
- ●MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్
- ●CM Revanth Reddy | నా కుడి వైపున మహిళలే ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే

Trisha | మెడలో తాళితో త్రిష?.. వైరల్ అవుతున్న చెన్నై క్వీన్ ఫొటోలు

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk Net Worth in Rupees | రూ. 9,49,50,50,00,00,000: ఎలాన్ మస్క్ 'ట్రిలియన్ డాలర్ల' ఆస్తితో ఏమేం కొనొచ్చో తెలుసా?

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కాదు.. మూడు నెలలు ఉండేలా లేదు : స్టాలిన్





