Portugal Vs Croatia | క్రొయేషియాపై పోర్చుగల్ పైచేయి
Portugal Vs Croatia | టొరొంటో స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఫుట్‌బాల్ అభిమానులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. చివరి క్షణాల వరకు నరాలు తెగితే ఉత్కంఠ పోరులో పోర్చుగల్ 2-1 తేడాతో క్రొయేషియాపై పునరాగమనం చేసి ప్రీక్వార్టర్‌కు అర్హత సాధించింది. 109 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి విజిల్ వరకు ఫలితం తేలకపోవడంతో ప్రేక్షకులు ఏం జరుగుతోందనని సర్వత్రా ఆసక్తిగా వీక్షించారు.
- ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన జట్టు
- 2-1 తేడాతో ఘన విజయం
- రొనాల్డో పెనాల్టీ గోల్
- చివరి నిమిషంలో రామోస్ హెడ్డర్
- వీఏఆర్ నిర్ణయంతో క్రొయేషియాకు షాక్
- జోటాకు రొనాల్డో భావోద్వేగ నివాళి
Portugal Vs Croatia | టొరొంటో స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ ఫుట్‌బాల్ అభిమానులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. చివరి క్షణాల వరకు నరాలు తెగితే ఉత్కంఠ పోరులో పోర్చుగల్ 2-1 తేడాతో క్రొయేషియాపై పునరాగమనం చేసి ప్రీక్వార్టర్‌కు అర్హత సాధించింది. 109 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి విజిల్ వరకు ఫలితం తేలకపోవడంతో ప్రేక్షకులు ఏం జరుగుతోందనని సర్వత్రా ఆసక్తిగా వీక్షించారు. మ్యాచ్ అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే, ద్వితీయార్థం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే ఇవాన్ పెరిశిచ్ అద్భుత వాలీతో క్రొయేషియాకు ఆధిక్యం అందించాడు. దీంతో పోర్చుగల్‌పై ఒత్తిడి పెరిగింది. సీనియర్ ప్లేయర్లు అయిన క్రొయేషియా మిడ్‌ఫీల్డ్‌ను ఛేదించడంలో పోర్చుగల్ ఇబ్బంది పడింది. చివరకు 68వ నిమిషంలో లభించిన పెనాల్టీని కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గోల్‌గా మలిచి జట్టుకు ఊపిరి పోశాడు.
మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించింది. ఈ సమయంలో పోర్చుగల్ కోచ్ రొబెర్టో మార్టినెజ్ కీలక నిర్ణయం తీసుకుని రొనాల్డోను మైదానం నుంచి వెనక్కి పిలిచాడు. ఆ నిర్ణయం ఫలించింది. ఎక్స్‌ట్రా టైమ్ నాలుగో నిమిషంలో రఫాయెల్ లియావో ఇచ్చిన అద్భుత క్రాస్‌ను ఆల్టర్నేటివ్ ప్లేయర్ గోన్సాలో రామోస్ పవర్‌ఫుల్ హెడ్డర్‌తో గోల్‌గా మలిచి పోర్చుగల్‌కు 2-1 ఆధిక్యం అందించాడు. అయితే, అసలు డ్రామా ఆ తర్వాతే జరిగింది. 10 నిమిషాల అదనపు సమయంలో చివరి క్షణంలో క్రొయేషియా గోల్ సాధించడంతో ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ, సుదీర్ఘంగా రివ్యూ చేసిన వీఏఆర్ ఆ గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో క్రొయేషియా ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. దీంతో పోర్చుగల్ విజయం ఖరారైంది. ఈ ఫలితంతో క్రొయేషియా దిగ్గజం లుకా మోడ్రిచ్ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడగా.. పోర్చుగల్ తదుపరి రౌండ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది.
ఈ విజయానంతరం పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. లివర్‌పూల్ మాజీ స్టార్, తన మాజీ సహచరుడు డియోగో జోటా మృతి చెందిన ఏడాదైంది. అతన్ని గుర్తు చేసుకుంటూ 21వ నంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చిన రొనాల్డో.. మ్యాచ్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లను ఆలింగనం చేసుకున్న అనంతరం జోటా జెర్సీతో అభిమానులకు అభివాదం చేస్తూ అతనికి నివాళి అర్పించాడు. 2025 జూలై 3న స్పెయిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డియోగో జోటా, అతని సోదరుడు ఆండ్రే సిల్వా మృతి చెందిన విషయం తెలిసిందే. జాతీయ జట్టు తరఫున 49 మ్యాచ్‌ల్లో 14 గోల్స్ చేసిన జోటా పోర్చుగల్‌కు అత్యంత కీలకమైన ఫార్వర్డ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. మ్యాచ్‌లో విజయం సాధించి అతనికి ఘన నివాళులర్పించింది.
A class act from Cristiano Ronaldo ❤️
Leaves the pitch in tears, remembering Diogo Jota carrying his presence with him in the most powerful way.
A remembrance, respect, and heartbreak all at once 🥺
Moments like this strip football down to what it really is ... Not just… pic.twitter.com/AqODAKEvMV
— Yazz LFC (@YazzLFC) July 3, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●ITR-1 | ఉద్యోగులకు ఐటీఆర్-1లో భారీ ఊరట.. సులభంగా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు..
- ●Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..
- ●Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి
- ●Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..
- ●Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
- ●Akkineni Akhil | కంగ్రాట్స్ సామ్.. సమంతకు అక్కినేని అఖిల్ విషెస్

ITR-1 | ఉద్యోగులకు ఐటీఆర్-1లో భారీ ఊరట.. సులభంగా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు..

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..

Hyderabad | ఇద్దరూ కలిసి హోటల్‌కి వెళ్లారు.. అంతలోనే రూమ్‌లో యువతి మృతి

Stock Markets | ఐటీ షేర్ల జోరుతో మార్కెట్లకు శుభారంభం.. భారీ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్..






