IPL 2025 | ఐపీఎల్‌లో పంజాబ్ చరిత్ర.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఘనత
PL 2025 | ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. అత్యధిక స్కోర్‌ను ఛేస్ చేసిన జట్టుగా నిలిచింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ పవర్‌ప్లేలోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 152 పరుగులు చేసినా ఢిల్లీ గెలువలేకపోయింది.
IPL 2025 | ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. పవర్ ప్లేలో అత్యధికంగా పరుగులు చేసి రికార్డులను తిరగరాశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ అజేయంగా 152 పరుగులు, నితీశ్ రాణా 91 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి కేవలం 5.2 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగులు జోడించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ వంద పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.
2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ఒత్తిడిలో కూడా ఆ జోడీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆరంభం నుంచే దాడి చేసింది. ప్రియాంశ్ ఆర్యా 17 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ కాగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 76 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మూడు ఫోర్ల సహాయంతో 71 పరుగులు చేసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అంతకు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 152 పరుగులతో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. నితీశ్ రాణాతో కలిసి ఆయన 96 బంతుల్లోనే 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






