త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SRH | స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌.. పాట్ క‌మ్మిన్స్ కోలుకునే వ‌ర‌కు..!

SRH | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది. అయితే, సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది.

P

Sports | Published On Mar 18, 2026, 6.30 pm IST

SRH | స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌.. పాట్ క‌మ్మిన్స్ కోలుకునే వ‌ర‌కు..!
Advertisement

SRH | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది. అయితే, సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ (Pat Cummins) ప్రారంభంలో ప‌లు మ్యాచుల‌కు దూరం కానున్నాడు. గత సంవత్సరం జూలై నుంచి వెన్నుపూస (లంబార్ స్ట్రెస్ ఫ్రాక్చర్) గాయంతో బాధపడుతున్న కమిన్స్ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ గాయంతో కమిన్స్ యాషెస్ సిరీస్‌లో కేవ‌లం ఒకే మ్యాచ్ ఆడాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూర‌మ‌య్యాడు. ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు.

ఈ నేపథ్యంలో కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్టార్ భారత బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిష‌న్ (Ishan Kishan) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్ నియ‌మించింది. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. మార్చి 23న కమిన్స్ జట్టుతో క‌లువ‌నున్నాడు. అయితే, మ్యాచులు ఆడే అవ‌కాశం మాత్రం లేదు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ జట్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తాడ‌ని మేనేజ్‌మెంట్ తెలిపింది. డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో మైదానంలో అడుగుపెట్టేందుకు కొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ త‌ర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఇక ఏప్రిల్ 5న తొలి హోమ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ఆడుతుంది.

 

https://x.com/SunRisers/status/2034226563965968747

Advertisement

తాజావార్తలు

Advertisement