త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fastest Goal in FIFA | 64 సెక‌న్ల‌లోనే గోల్‌.. మాటియాస్ ప్ర‌పంచ రికార్డు

Fastest Goal in FIFA | ఫిఫా ప్రపంచకప్-2026లో పరాగ్వే మిడ్‌ఫీల్డర్ మ‌టియాస్ గలార్జా అరుదైన ఘనత సాధించాడు. తుర్కియేతో జరిగిన కీలక గ్రూప్-డీ మ్యాచ్‌లో కేవలం 64 సెకన్లకే గోల్ సాధించి టోర్నీలో ఫాస్టెస్ట్ గోల్ వేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు.

P

Sports | Published On Jun 20, 2026, 3.36 pm IST

Fastest Goal in FIFA | 64 సెక‌న్ల‌లోనే గోల్‌.. మాటియాస్ ప్ర‌పంచ రికార్డు
Advertisement

Fastest Goal in FIFA | ఫిఫా ప్రపంచకప్-2026లో పరాగ్వే మిడ్‌ఫీల్డర్ మ‌టియాస్ గలార్జా అరుదైన ఘనత సాధించాడు. తుర్కియేతో జరిగిన కీలక గ్రూప్-డీ మ్యాచ్‌లో కేవలం 64 సెకన్లకే గోల్ సాధించి టోర్నీలో ఫాస్టెస్ట్ గోల్ వేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గలార్జా రెండో నిమిషంలోనే అద్భుత‌మైన షాట్‌తో బంతిని ప్ర‌త్య‌ర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దాంతో ప‌రాగ్వే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌కు దుర‌మైన మాటియాస్‌కు తుర్కియేపై తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం ద‌క్కింది. త‌న‌ను ఎంపిక చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మేన‌ని నిరూపించాడు.

ఇస్మాయిల్ సైబ‌రీ రికార్డుకు చెక్‌

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ గోల్ రికార్డు మొరాకో ప్లేయ‌ర్ ఇస్మాయిల్ సైబ‌రీ పేరిట ఉండేది. స్కాట్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవ‌లం 70 సెకన్లకే గోల్ సాధించాడు. తాజాగా గలార్జా అత‌ని రికార్డును ఆరు సెకన్ల తేడాతో అధిగ‌మించాడు. ఇదిలా ఉండ‌గా.. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా చేతిలో పరాగ్వే 1-4 తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. దాంతో తుర్కియేతో మ్యాచ్ ఆ జ‌ట్టుకు కీల‌క‌మైంది. గలార్జా ఆరంభంలోనే చేసిన గోల్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ త‌ర్వాత జ‌ట్టు డిఫెన్స్ అద్భుతంగా రాణించి తుర్కియేను నిలువ‌రించింది. తుర్కియే ప‌లుసార్లు గోల్ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌ను విజ‌య‌వంతంగా అడ్డుకుంది.

గోల్ త‌ర్వాత ఎల్లోకార్డ్‌..

రికార్డు స‌మ‌యంలో గోల్ సాధించిన కొద్ది నిమిషాలకే గలార్జాకు ఫౌల్ కారణంగా ఎల్లో కార్డును ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయినా అత‌ని ఆట‌తీరుపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేదు. మ్యాచ్ మొత్తం ఉత్సాహంగా ఆడుతూ జ‌ట్టుకు కీల‌కంగా మారాడు. గ్రూప్‌-డీలో అమెరికా ఇప్ప‌టికే ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించి రౌండ్ ఆఫ్ 32కి అర్హ‌త సాధించింది. దాంతో ప‌రాగే, తుర్కియే జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కంగా మారింది. గ‌లార్జా ఆరంభంలోనే గోల్ వేయ‌డంతో ప‌రాగ్వే ఆధిక్యంలో నిలిచి నాకౌట్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. త‌ర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్ట‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టే నాకౌట్‌లోకి వెళ్తుంది.

Advertisement
Advertisement