Asian Champions Trophy | ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్!
Asian Champions Trophy | పురుషుల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది. పంజాబ్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో పాక్ స్థానంలో బంగ్లాదేశ్‌కు చోటు కల్పించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జలంధర్, మొహాలీలో పోటీలు జరగనున్నాయి.
Asian Champions Trophy | పురుషుల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది. పంజాబ్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో పాక్ స్థానంలో బంగ్లాదేశ్‌కు చోటు కల్పించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జలంధర్, మొహాలీలో పోటీలు జరగనున్నాయి. ఆతిథ్య భారత్ సహా జపాన్, చైనా, మలేసియా, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ టోర్నీతో పంజాబ్‌లో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొననున్నది.
మళ్లీ టైటిల్‌పై భారత్ గురి..
భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటివరకు నాలుగుసార్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇటీవల జపాన్‌లో జరిగిన ఐచి–నగోయా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే జోరును కొనసాగిస్తూ స్వదేశంలో మరో టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప విజయమని, ఇప్పుడు ఆసియా చాంపియన్స్ ట్రోఫీపైనే తమ దృష్టి ఉందని భారత జట్టు ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తెలిపారు. ఆటగాళ్లు అదే లయ, ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మొహాలీలో టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాకిస్తాన్ కూడా పాల్గొంటుందని వెల్లడించారు. హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి భోలానాథ్ సింగ్ సహా పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో బంగ్లాదేశ్, ఒమన్ జట్లను రిజర్వ్ జట్లుగా చేర్చారు. అయితే షెడ్యూల్ ప్రకటించిన రెండు రోజులకే భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య నిరాకరించింది. టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా హాకీ సమాఖ్యను కోరింది. దీంతో పాక్ స్థానంలో బంగ్లాదేశ్‌ను చేర్చారు.
2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు బంద్
2008 ముంబయి ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లు జరగలేదు. 2023లో భారత్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చివరిసారిగా పాల్గొంది. ఆ టోర్నీలో ఆరు జట్లలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది భారత్‌లో జరిగిన ఆసియా కప్, జూనియర్ ఆసియా కప్ పోటీల్లోనూ పాక్ పాల్గొనలేదు. భారత హాకీ జట్టు చివరిసారిగా 2006లో పాకిస్తాన్‌లో పర్యటించి సిరీస్ ఆడింది. పాకిస్తాన్ తప్పుకోవడంతో స్వదేశంలో టైటిల్ నిలబెట్టుకోవడంపై భారత్ దృష్టి సారించనుంది. మరోవైపు, ఆసియా స్థాయిలో తమ సత్తా చాటేందుకు బంగ్లాదేశ్‌కు ఈ టోర్నీ కీలక అవకాశంగా మారనుంది.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ



