PAK vs NED | మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన క్యాచ్.. నెదర్లాండ్‌పై తృటిలో ఓటమిని తప్పించుకున్న పాక్..!
PAK vs NED | టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి నుంచి అనూహ్యంగా తప్పించుకుంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులతో కష్టాల్లో పడింది.
PAK vs NED | టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి నుంచి అనూహ్యంగా తప్పించుకుంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులతో కష్టాల్లో పడింది. చివరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే, 19వ ఓవర్ మ్యాచ్ వదిలేయడంతో స్వరూపాన్నే మార్చేసింది.
19వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన లోగాన్ వాన్ బీక్ బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది కలిసి 24 పరుగులు రాబట్టారు. ఆ ఓవర్‌లోని తొలి బంతికి ఫహీమ్ సిక్స్ కొట్టగా, రెండో బంతికి మాక్స్ ఓడాడ్ తేలికైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఆ తర్వాత ఫహీమ్ తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాతి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. చివరి ఓవర్‌లో గెలవడానికి ఐదు పరుగులు అవసమయ్యాయి. పాక్ జట్టు 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫహీమ్ 11 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 పరుగులు చేయగా, షాహీన్ అఫ్రిది ఐదు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కాగా.. పాక్ క్యాచ్‌ను వదిలేయడంతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో మూడు వికెట్లకు 105 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఆ జట్టు ఆ తర్వాత మిగిలిన ఏడు వికెట్లను కేవలం 42 పరుగులకే కోల్పోయింది. నెదర్లాండ్స్ జట్టు నాల్గవ ఓవర్లో 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. సల్మాన్ మీర్జా బౌలింగ్ లో మాక్స్ ఓ'డౌడ్ (5) వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐదో ఓవర్లో స్కోరు 31 పరుగుల వద్ద ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో మైఖేల్ లెవిట్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద బాబర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. లెవిట్ 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఎనిమిదవ ఓవర్లో 65 పరుగుల నెదర్లాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో కాలిన్ అకెర్మాన్ 14 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 105 పరుగుల వద్ద నవాజ్ బౌలింగ్‌లో బాస్‌డీ లీడ్ 25 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత 29 బంతుల్లో 37 పరుగులు చేసిన స్కాట్‌ను అబ్రార్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జాక్ లియాన్ కాష్ (9), లోగన్ వాన్ బీక్ (0), వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్ (13), వాన్ మీకెరెన్ (0) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






