T20 World Cup | నమీబియాపై విజయం.. సూపర్ ఎయిట్‌కి అర్హత సాధించిన పాక్..
T20 World Cup | కొలంబోలోని ఎస్ఎస్‌సీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో నమీబియాను 102 పరుగుల తేడాత ఓడించి ప్రపంచకప్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో నమీబియాను ఓడించింది.
T20 World Cup | కొలంబోలోని ఎస్ఎస్‌సీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో నమీబియాను 102 పరుగుల తేడాతో ఓడించి సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో నమీబియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది.
గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్ గ్రూప్-బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్-సీ నుంచి వెస్టిండిస్, ఇంగ్లండ్, గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ ఎయిట్‌లోకి ప్రవేశించాయి. సూపర్ ఎయిట్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లు విభజిస్తారు. గ్రూప్-లో భారత్, జింబాబ్వే, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉంటాయి. ప్రతి జట్టు గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరుతాయి.
శనివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్-పాక్ మ్యాచ్‌తో సూపర్ ఎయిట్ రౌండ్ మొదలవుతుంది. ప్రతిగ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే మార్చి 4న కొలంబోలో జరిగే తొలి సెమీ ఫైనల్‌లో ఆడుతుంది. అర్హత సాధించకపోతే కోల్‌కతా వేదికగా జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ మార్చి 5న ముంబయిలోని వాంఖడేలో జరుగుతుంది. భారత్ అర్హత సాధిస్తే రెండో సెమీఫైనల్ ఆడుతుంది. పాక్ ఫైనల్‌కి అర్హత సాధిస్తే కొలంబో వేదికగా జరుగుతుంది. లేకపోతే అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంటుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






