T20 World Cup | కెనడాపై విజయంతో సూపర్8లోకి కివీస్..!
T20 World Cup | టీ20 ప్రపంచ కప్‌లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎచుకున్న కెనడా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
T20 World Cup | టీ20 ప్రపంచ కప్‌లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎచుకున్న కెనడా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యువరాజ్ సమ్రా 65 బంతుల్లో 110 పరుగులు చేశాడు. సమ్రా సెంచరీ ఎదుట గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర సాధించిన అర్ధ సెంచరీలు సైతం తెల్లబోయాయి. న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 174 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది, సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించిన ఆరో జట్టుగా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా యువరాజ్ సమ్రా, కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా తొలి వికెట్‌కు 84 బంతుల్లో 116 జోడించారు. దాంతో కెనడాకు శుభారంభం దక్కింది. దిల్‌ప్రీత్ సింగ్ 39 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత నవనీత్ ధాలివాల్ 10 పరుగులే చేశాడు. దిల్‌ప్రీత్‌ను జేమీసన్, నవనీత్‌ను మాట్ హెన్రీ పెవిలియన్‌కు పంపాడు. యువరాజ్ 58 బంతుల్లో సెంచరీ చేశాడు. 65 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో మొత్తం 110 పరుగులు చేయగా.. జాకబ్ డఫీ పెవిలియన్‌కు పంపాడు. చివరలో హర్ష్ థాకర్ మూడు, డిలన్ హెయిలిగర్ ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ తరఫున, హెన్రీ, డఫీ, జేమీసన్, నీషమ్‌కి ఒక్కొక్క వికెట్ దక్కింది. 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌కు 30 పరుగుల వద్ద డబుల్ స్ట్రోక్ తగిలింది. టిమ్ సీఫెర్ట్ (6), ఫిన్ అలెన్ (21) తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ మూడో వికెట్ కు 72 బంతుల్లో అజేయంగా 146 పరుగులు జోడించారు. రచిన్ రవీంద్ర 39 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59, ఫిలిప్స్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో న్యూజిలాండ్ సూపర్8లోకి ఎంట్రీ ఇచ్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






