Chinnaswamy Stadium | చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్స్‌కు కుంబ్లే, ద్రవిడ్ పేర్లు.. కేఎస్‌సీఏ నిర్ణయం..!
Chinnaswamy Stadium | కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కొన్ని స్టాండ్లను భారత క్రికెట్ లెజెండ్స్ అయిన అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌తో పాటు మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ శాంత రామస్వామి పేర్లను పెట్టాలని నిర్ణయించింది.
Chinnaswamy Stadium | కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కొన్ని స్టాండ్లను భారత క్రికెట్ లెజెండ్స్ అయిన అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌తో పాటు మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ శాంత రామస్వామి పేర్లను పెట్టాలని నిర్ణయించింది. కుంబ్లే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఇక రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఈ ఇద్దరు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు హెడ్‌కోచ్‌లుగా సేవలందించారు.
ఈ సందర్భంగా కుంబ్లే స్పందించాడు. మనందరి కృషి కర్నాటక క్రికెట్‌ను ఎంత ఎత్తు వరకు తీసుకువచ్చింది. అలాగే, కర్నాటక క్రికెట్ మనందరినీ తీర్చిదిద్దింది. స్టాండ్స్‌పై ఎవరి పేరు ఉంటుందనేది పెద్ద విషయం కాదు.. అందరి కృషిని గుర్తించడం, శాశ్వతంగా నిలుపడం ప్రత్యేకత అని పేర్కొన్నాడు. ద్రవిడ్‌తో పాటు శాంతా రంగస్వామి ఈ గౌరవం హర్షం వ్యక్తం చేశాడు. ఇద్దరు సహచరులు కర్నాటక, భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని తెలిపాడు. స్టాండ్స్ లెజెండ్స్‌ను గుర్తు చేస్తాయని.. ఇది చాలా గర్వకారణమని కుంబ్లే తెలిపాడు. రాహుల్ ద్రావిడ్ చిన్నస్వామి స్టేడియాలో తనకు రెండో ఇల్లుగా భావిస్తుంటాడు. ఇది జీవితంలో చాలా కీలకమైన ప్రదేశమని.. ఇక్కడ సంతోషంగా, నిరాశతో ఉన్న సందర్భాలు ఉన్నాయని.. ఏదైనా తాను సాధించగలిగింది అది ఇక్కడేనని.. కేఎస్‌సీఏ ఇచ్చిన అవకాశాలేనని తెలిపాడు. ఈ స్టేడియానికి తాను ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతానని ద్రవిడ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






