త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. అగ్ర‌స్థానంలో అభిషేక్‌

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ల ర్యాంకులు మెరుగుయ్యాయి. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో న‌లుగురు కివీస్ బౌల‌ర్లు ఈ ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంకుల‌కు చేరుకున్నారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్ 12 ర్యాంకులు మెరుగుప‌రుచుకొని 39వ స్థానానికి చేరాడు.

P

Sports | Published On Mar 25, 2026, 6.00 pm IST

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. అగ్ర‌స్థానంలో అభిషేక్‌
Advertisement

ICC T20 Rankings | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ల ర్యాంకులు మెరుగుయ్యాయి. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో న‌లుగురు కివీస్ బౌల‌ర్లు ఈ ర్యాంకింగ్స్‌లో మెరుగైన ర్యాంకుల‌కు చేరుకున్నారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్ 12 ర్యాంకులు మెరుగుప‌రుచుకొని 39వ స్థానానికి చేరాడు. ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ 20 స్థానాలు ఎగ‌బాకి 59వ స్థానానికి చేరాడు. కైల్ జామీసన్ ఐదు స్థానాలు మెరుగుప‌రుచుకొని 76వ, జాక్వెరీ ఫాల్క్స్ ఎనిమిది స్థానాలు మెరుగుప‌రుచుకొని 81వ స్థానానికి చేరాడు.

ద‌క్షిణాఫ్రికా బౌలర్లు త‌మ ర్యాంకుల‌ను మెరుగుప‌రుచుకున్నారు. కేశ‌వ్ మ‌హ‌రాజ్ ఐదుస్థానాలు మెరుగుప‌రుచుకొని 47వ స్థానానికి చేరాడు. ఓట్నిల్ బార్ట్‌మ‌న్ 66వ‌, జెరాల్డ్ కోయెట్జీ 88వ స్థానానికి చేరాడు. ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో జార్జ్ లిండే 22వ స్థానంలోకి వచ్చాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా టాప్ అగ్ర‌స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇదిలా ఉండ‌గా.. భార‌త బ్యాట్స్‌మెన్ త‌మ ర్యాంకుల‌ను నిల‌బెట్టుకున్నారు. టీమిండియా స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ టీ20 బ్యాట‌ర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇషాన్ కిష‌న్ రెండోస్థానంలో ఉన్నాడు. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ రెండుస్థానాలు మెరుగుప‌రుచుకొని 7వ స్థానానికి చేర‌గా.. న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబడి 34వ స్థానంలోకి చేరాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement