త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | న‌మీబియాపై నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యం.. పాక్‌ని వెన‌క్కినెట్టి పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్థానానికి..!

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా మంగ‌ళ‌వారం మంగ‌ళ‌వారం గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో న‌మీబియాపై నెద‌ర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్ల స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

P

Sports | Published On Feb 10, 2026, 3.55 pm IST

T20 World Cup | న‌మీబియాపై నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యం.. పాక్‌ని వెన‌క్కినెట్టి  పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్థానానికి..!
Advertisement

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా మంగ‌ళ‌వారం మంగ‌ళ‌వారం గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో న‌మీబియాపై నెద‌ర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్ల స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత నెద‌ర్లాండ్స్ 18 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు న‌ష్ట‌పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. బాస్ డి లీడే 48 బంతుల్లో 72 నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పాకిస్తాన్‌ను అధిగ‌మించి..

ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో పాకిస్తాన్‌ను నెద‌ర్లాండ్స్ అధిగ‌మించి గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరుకుంది. న‌బీమియాపై విజ‌యంతో రెండు మ్యాచుల్లో రెండు పాయింట్లు ప‌స్ల్ 0.356 ర‌న్ రేట్ ఉన్న‌ది. భార‌త్ ఒక మ్యాచ్ విస‌యం, ప్ల‌స్ 1.450 ర‌న్ రేట్‌తో అగ్ర‌స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానానికి ప‌డిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్ల‌తో పాటు ప్ల‌స్ 0.240 పాయింట్లు ఉన్నాయి. న‌మీబియా మైన‌స్ 1.033 ర‌న్‌రేట్‌తో నాలుగో స్థానంలో, యూఎస్ఏ 1.450 ర‌న్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను నెద‌ర్లాండ్స్ ఓడించి ఉంటే.. ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉండేది. నెద‌ర్లాండ్స్ సూప‌ర్ 8లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ‌ట్టి పోటీ ఇచ్చేది. పాక్‌తో మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ దాదాపు గెలిచే ఛాన్స్ ఉన్నా ఓట‌మిపాలైంది. పాక్ 19.3 ఓవ‌ర్ల‌లో విజ‌యం సాధించింది.

నెద‌ర్లాండ్స్ ఇన్నింగ్స్ ఇలా..

157 ప‌రుగుల టార్గెట్‌ను సాధించిన ఆ జ‌ట్టుకు శుభారంభం ద‌క్క‌లేదు. 16 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. మ్యాక్స్ ఓ'డౌడ్ ను బెర్నార్డ్ స్కోల్జ్ ఏడు పరుగులకు అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత మైఖేల్ లెవిట్‌-బాస్ డి లీడ్ జోడి రెండో వికెట్‌కు 30 ప‌రుగులు జోడించింది. లెవిట్ 15 బంతుల్లో 28 ప‌రుగులు చేసి రూబెన్ ట్రంపెల్మాన్‌కి చిక్కాడు. కాలిన్ అకెర్మాన్ 28 బంతుల్లో 32 పరుగులు చేసి నికోల్ లాఫ్టీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత అకెర్మాన్‌తో క‌లిసి డి లీడ్ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఆ త‌ర్వాత స్కాట్ ఎడ్వ‌ర్డ్స్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 43 ప‌రుగులు జోడించి జ‌ట్టును విజ‌యానికి చేరువ చేశాడు. ఎడ్వర్డ్స్ తొమ్మిది బంతుల్లో 18 పరుగులు చేయ‌గా.. డి లీడ్ 48 బంతుల్లో 72 పరుగులతో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచాడు.

న‌మీబియా ఇన్నింగ్స్‌..

తొలుత బ్యాటింగ్స్ చేసిన న‌మీబియాకు ఆరంభం క‌లిసిరాలేదు. ప‌ది ప‌రుగుల వ‌ద్ద లౌరెన్ స్టీన్‌క్యాంప్‌ని ఆర్య‌న్ ద‌త్ పెవిలియ‌న్‌కు పంపాడు. జాన్ ఫ్రీలింక్-జాన్ నికోల్ రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. లోగన్ వాన్ బీక్ ఫ్రీలింక్ ఈ భాగ‌స్వామ్యానికి తెర‌దించాడు. ఫ్రీలింక్ 26 బంతుల్లో 30 పరుగులు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ తొమ్మిది బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. జేన్ నికోల్ 38 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత న‌బీమియా వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (18), జేజే స్మిత్ (22), జేన్ గ్రీన్ (9), రూబెన్ ట్రంపెల్మాన్ (9), డైలాన్ లీచర్ (6), విలియం మైబర్గ్ (4) ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. నెదర్లాండ్స్ తరపున బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్‌కి త‌లా ఒక వికెట్ ద‌క్కింది.

Advertisement
Advertisement