MI vs KKR | మరో మైలురాయికి చేరువైన రోహిత్ శర్మ.. డేవిడ్ వార్నర్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్..!
MI vs KKR | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రెండో మ్యాచ్ ఆదివారం వాంఖడే స్టేడియ వేదికగా జరుగనుంది. ముంబయి ఇండియన్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగనుంది. వాంఖడేలో కేకేఆర్‌పై ముంబయికి అద్భుతమైన రికార్డ్ ఉంది.
MI vs KKR | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రెండో మ్యాచ్ ఆదివారం వాంఖడే స్టేడియ వేదికగా జరుగనుంది. ముంబయి ఇండియన్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగనుంది. వాంఖడేలో కేకేఆర్‌పై ముంబయికి అద్భుతమైన రికార్డ్ ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ మైలురాయిని చేరేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. 28 ఇన్నింగ్స్‌లో వార్నర్ 1093 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నాడు. 35 ఇన్నింగ్స్‌లో 1083 పరుగులు చేశాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే రోహిత్ కేకేఆర్‌పై ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. కేకేఆర్‌పై రోహిత్‌కు సైతం మంచి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై శతకంతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.
వాంఖడేలో హెడ్స్-టు-హెడ్స్ రికార్డ్
ముంబయి-కోల్‌కతా మధ్య వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు 12 మ్యాచులు జరిగాయి. అందులో ముంబయి పది మ్యాచ్‌ల్లో గెలిచింది. కేకేఆర్ కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచింది. మొత్తం ఐపీఎల్‌లో 35 మ్యాచుల్లో ముంబయి 24 విజయం సాధించింది. కేకేఆర్ 11 సార్లు మాత్రమే గెలిచింది. ముంబయి ఇండియన్స్ ఈ సీజన్‌లో బలమైన టీమ్‌గా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ కీలకం. దీపక్ చాహార్, శార్దుల్ ఠాకూర్ పవర్ ప్లేలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం బ్యాటింగ్ సైతం బలంగానే కనిపిస్తోంది. టీమ్ స్టీఫర్ట్, ఫిన్ అలెన్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అజింక్య రహానే, రింకు సింగ్, రోవ్‌మెన్ పావెల్ ప్రదర్శన జట్టు విజయానికి కీలకం. అయితే, ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ సింగ్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






