త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Indians | ముంబ‌యి ఇండియ‌న్స్‌కి స‌వాల్‌.. ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేనా..?

Mumbai Indians | ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ముంబ‌యి ఇండియ‌న్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ముంబ‌యి వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగ‌నుంది. గత 13 సంవత్సరాలుగా టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోతున్న ముంబ‌యి జట్టు.. ఈ సారైనా విజ‌యం న‌మోదు చేయాల‌నే క‌సితో బ‌రిలోకి దిగుతోంది.

P

Sports | Published On Mar 29, 2026, 2.55 pm IST

Mumbai Indians | ముంబ‌యి ఇండియ‌న్స్‌కి స‌వాల్‌.. ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేనా..?
Advertisement

Mumbai Indians | ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ముంబ‌యి ఇండియ‌న్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ ముంబ‌యి వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగ‌నుంది. గత 13 సంవత్సరాలుగా టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోతున్న ముంబ‌యి జట్టు.. ఈ సారైనా విజ‌యం న‌మోదు చేయాల‌నే క‌సితో బ‌రిలోకి దిగుతోంది. ముంబ‌యి చివ‌రిసారిగా 2012లోనే తొలి మ్యాచ్‌ను గెలిచింది. హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలోని ముంబ‌యి జ‌ట్టు ఈ సారి మంచి ఆరంభాన్ని ఆశిస్తోంది. జట్టును పరిశీలిస్తే, ఈసారి బలమైన కూర్పుతో బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.

ఓపెనింగ్ విభాగంలో రోహిత్ శ‌ర్మ‌, క్వింట‌న్ డికాక్‌, రియాన్ రికెల్ట‌న్ వంటి ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌ర్స్ ఉన్నారు. మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, నామ‌న్ ధీర్ వంటి బ్యాట‌ర్లు ఉన్నారు. వేలంలో తీసుకున్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ మ్యాచ్ ఫ‌లితాన్నే మార్చ‌గ‌లిగే స‌త్తా ఉంది. అలాగే, కార్బిన్ బాష్‌, విల్ జాక్స్‌, శార్దుల్ ఠాకూర్ రూపంలో ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న విల్ జాక్స్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం ముంబ‌యికి ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ముందుకు న‌డిపించ‌నున్నారు. దీప‌క్ చ‌రార్‌, ట్రెంట్ బౌల్డ్ అండ‌గా నిలువ‌నున్నారు.

స్పిన్ విభాగంలో అల్లా ఘజన్‌ఫర్, మిచెల్ శాంట్న‌ర్ ఉండ‌గా.. ఈ మ్యాచ్‌కు శాంట్న‌ర్ అందుబాటులో ఉండ‌డం లేదు. అవ‌స‌ర‌మైతే మ‌యాంక్ మార్కండేను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంది. ఇక కేకేఆర్‌పై ముంబ‌యికి మైదానంలో మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు అక్కడ ఆడిన చివరి 12 మ్యాచుల్లో కేకేఆర్ కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 35 సార్లు తలపడగా, అందులో ముంబై 24 మ్యాచ్‌లు గెలిచింది. కేకేఆర్ 11 మ్యాచుల్లోనే గెలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో ముంబ‌యి ప్రతిష్టాత్మక రికార్డును నిలబెట్టుకుంటుందా? లేక కేకేఆర్ చరిత్రను మార్చుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement