Argentina Vs Austria | మెస్సీ డబుల్.. నాకౌట్‌కు అర్జెంటినా
Argentina Vs Austria | ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటినా స్టార్ ప్లేయర్, కెప్టెన్ అలియోనెల్ మెస్సీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ గోల్ చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రియాతో సోమవారం జరిగిన గ్రూప్–జే మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన మెస్సీ, ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
- వరుసగా రెండో విజయాలు
- 2-0 తేడాతో ఆస్ట్రియాపై గెలుపు
- 17 వరల్డ్‌కప్ గోల్స్‌తో చరిత్ర సృష్టించిన మెస్సీ
- క్లేజే రికార్డును అధిగమించిన కెప్టెన్
Argentina Vs Austria | ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటినా స్టార్ ప్లేయర్, కెప్టెన్ అలియోనెల్ మెస్సీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ గోల్ చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఆస్ట్రియాతో సోమవారం జరిగిన గ్రూప్–జే మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన మెస్సీ, ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో అర్జెంటీనా 2-0 తేడాతో విజయం సాధించి నాకౌట్‌లోకి ప్రవేశించింది. అల్జీరియాపై హ్యాట్రిక్ సాధించి జోష్‌లో ఉన్న మెస్సీ.. ఈ మ్యాచ్‌కు ముందు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజేతో సమానంగా 16 ప్రపంచకప్ గోల్స్‌తో ఉన్నాడు. ఒకే గోల్‌తో రికార్డును అధిగమించే అవకాశముండడంతో అభిమానులంతా మెస్సీ ఎలా రాణిస్తాడని ఆసక్తిగా ఎదురుచూశారు.
పెనాల్టీ మిస్ అయినా..

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అర్జెంటీనాకు పెనాల్టీ లభించింది. లౌటారో మార్టినెజ్‌ను బాక్స్‌లో ఫౌల్ చేయడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. స్టేడియంలో ఉన్న 70వేల మందికిపైగా అభిమానులు చరిత్రాత్మక క్షణాన్ని చూసేందుకు సిద్ధమయ్యారు. మెస్సీ షాట్ కుడి పోస్ట్‌కు బయటకు వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆస్ట్రియా ఊపిరిపీల్చుకోగా.. అర్జెంటీనా అభిమానులు నిరాశ చెందారు. ఒక మిస్టేక్ కారణంగా తక్కువగా అంచనా వేయలేమని మరోసారి రుజువు చేశాడు. తొలి అర్ధభాగం ముగియడానికి కాసేపటి ముందు పెనాల్టీ ఏరియా అంచున బంతిని అందుకున్న మెస్సీ.. తనదైన శైలిలో అద్భుతంగా కర్ల్ షాట్‌తో గోల్ వేయడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ గోల్‌తో ప్రపంచకప్‌లో మెస్సీ గోల్స్ సంఖ్య 17కు చేరి క్లోజే రికార్డును అధిగమించాడు. ప్రపంచకప్ అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ జాబితాలో అగ్రస్థానికి చేరుకున్నాడు. అంతే కాకుండా వరుస ఆరు ప్రపంచకప్ మ్యాచుల్లో గోల్ చేసిన మూడో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫాంటెయిన్, బ్రెజిల్ లెజెండ్ జైర్జిన్హో తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు.
ఆస్ట్రియాకు అవకాశం ఇవ్వకుండా..

ద్వితీయార్థంలో ఆస్ట్రియా పోరాట పటిమను ప్రదర్శించింది. అయినా, అర్జెంటీనా ఆధిపత్యమే కొనసాగింది. మార్సెల్ సాబిట్జర్ ఫ్రీకిక్‌తో గోల్ ప్రయత్నించగా.. మార్కో ఆర్నాటోవిచ్ రాకతో ఆస్ట్రియా అటాకింగ్ కాస్త మెరుగైంది. అర్జెంటీనా డిఫెన్ మాత్రం ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇంజ్యురీ కారణంగా మధ్యలో మైదానం వీడే వరకు క్రిస్టియన్ రొమెరో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నికోలస్ ఒటామెండీ డిఫెన్స్‌లో కీలక పాత్ర పోషించగా.. గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ సైతం సత్తాచాటాడు. ఇంజ్యురీ టైమ్‌లో మెస్సీ మరోసారి మెరిశాడు. కుడి వైపు నుంచి దూసుకొచ్చి జూలియన్ ఆల్వారెజ్‌కు బంతిని అందించాడు. ఆల్వారెజ్ షాట్‌ను సరిగా కనెక్ట్ చేయలేకపోయినా.. మరోసారి వేగంగా ముందుకు కదిలి రీబౌండ్‌ను అందుకొని బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో ప్రపంచకప్‌లో గోల్స్ సంఖ్య 18కు చేరుకుంది. ఈ విజయంతో గ్రూప్–జేలో వరుసగా రెండు విజయాలు సాధించిన అర్జెంటీనా.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జూన్ 27న జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో జోర్డాన్‌తో తలపడనుంది. అయితే ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మాత్రం ఇప్పటికీ 39 ఏళ్ల మెస్సీపైనే ఉంది. వయసు పెరుగుతున్నా మైదానంలో ఆ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Norway vs Senegal | నాకౌట్‌లోకి నార్వే
- ●Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
- ●ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!
- ●Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు
- ●France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్
- ●Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి









