Lungi Ngidi | లుంగి ఎంగిడీకి తలకు తీవ్రగాయం.. స్టేడియంలోకి వచ్చిన అంబులెన్స్
Lungi Ngidi | పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగి ఎన్‌గిడి ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో ఆయనను స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించాడు. దుష్మంత చమీరా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు.
Lungi Ngidi | ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఘోర ఘటన చోటు చేసుకున్నది. ఫీల్డింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే ప్రయత్నంలో వెనక్కి పరుగెత్తిన ఈ బౌలర్ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రియాంశ్ ఆర్యా ఆడిన భారీ షాట్‌కు ప్రయత్నించగా బంతి గాల్లోకి ఎగిరింది. క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన ఎంగిడీ పూర్తిగా నియంత్రణ కోల్పోయి పడిపోయాడు.
దాంతో తలకు తీవ్రమైన గాయమైంది. కొద్దిసేపు ఆయన మైదానంలోనే కదలకుండా పడిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య సిబ్బంది వెంటనే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కొంత ఆందోళన మధ్యలోనే ఆయన వైద్యుల ప్రశ్నలకు స్పందించినా.. లేవలేకపోయాడు. ఈ ఘటనతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. మైదానంలో ఉన్న ఆటగాళ్లు, ప్రేక్షకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత లుంగి ఎన్‌గిడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆయన స్థానంలో దుష్మంత చమీరాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తీసుకున్నారు.
Lung Ngidi seriously Injured #DCvsPBKS pic.twitter.com/KIyVVcJSjF
— Aditya SRKian 🚩 (@AdityaRaut85685) April 25, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






